కేటీఆర్ నయా లుక్.. ఫ్యాన్స్ సందడి.. తారకరాముడు హ్యాపీ..!

హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నయా లుక్ అదిరింది. క్లీన్ షేవ్‌తో తళుక్కుమని మెరిసే తారకరాముడు స్టైల్ మార్చారు. కొత్తగా మీసం, గడ్డంతో దర్శనమిచ్చారు. అభిమాన నేత నయా లుక్ ఫోటో చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికపై భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అన్న హ్యాండ్‌సమ్ అని కొందరంటే.. ఏ వయసులో ఉన్నా సింహం సింహమే అంటూ మరికొందరు కామెంటుతున్నారు.

మీసం, గడ్డం.. తారకరాముడి కొత్త గెటప్..!

మీసం, గడ్డం.. తారకరాముడి కొత్త గెటప్..!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లుక్ మారింది. ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో చిరుదరహాసంతో కనిపించే అందాల తారక రాముడు గెటప్ ఛేంజ్ అయింది. మీసం, గడ్డంతో కనిపిస్తున్న కొత్త ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆయన ఫ్యాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. అదే ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. కొత్త గెటప్‌లో బాగున్నారన్నా అంటూ ఆయన ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు.

ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో కనిపించే కేటీఆర్ మీసం, గడ్డంతో ఎలా ఉంటారనేది ఓ అభిమానికి వచ్చిన ఆలోచన. అలా ఫేస్ యాప్‌ను ఫాలో అయ్యారు. కేటీఆర్ ఏదో సందర్భంలో మాట్లాడుతున్న ఫోటో సేకరించారు. దానికి ఇలా లుక్ మార్చేశారు. మొత్తానికి ఆయన ప్రయోగం ఫలించి కేటీఆర్‌కు కొత్త గెటప్ తీసుకొచ్చారు.

థ్యాంక్స్, నాట్ బ్యాడ్.. కేటీఆర్ రిప్లై ఇలా..!

ఫేస్ యాప్ ద్వారా కేటీఆర్ పూర్తి గెటప్ మార్చేశారు సదరు అభిమాని. ఇంకేముంది ఫోటో బాగా వచ్చేసరికి దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి కేటీఆర్‌కు ట్యాగ్ పెట్టారు. అది చూసిన తారకరాముడు పాజిటివ్‌గానే స్పందించారు. థ్యాంక్స్ "నాట్ బ్యాడ్" అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ఈ ఫోటోను ట్విట్టర్ పోస్టులో గాకుండా సెపరేటుగా చూసినోళ్లు మాత్రం పరేషాన్ అవుతున్నారట. కేటీఆర్ ఒరిజినల్ గెటప్ కన్నా.. ఈ గెటప్‌లోనే బాగున్నారంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారట. కొన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ఫోటో తెగ వైరల్ అవుతుండటంతో ఇది నిజంగా కేటీఆర్ కొత్త లుక్ అని నమ్మేస్తున్నారట. అదలావుంటే ఫేస్ యాప్ గురించి తెలియనోళ్లు ఇది కేటీఆర్ నయా గెటప్ అంటూ దోస్తులకు ఫార్వర్డ్ చేస్తున్నారట.

లెక్కలేనన్ని కామెంట్లు.. అన్నా సూపర్ అంటూ పొగడ్తలు..!

లెక్కలేనన్ని కామెంట్లు.. అన్నా సూపర్ అంటూ పొగడ్తలు..!

ఇక ట్విట్టర్ వేదికపై కామెంట్లు దుమ్ము రేపుతున్నాయి. గడ్డంతో మీ లుక్ అదుర్స్ అన్న అని కొందరంటే.. సూపర్ స్టార్లు అని చెప్పుకునే సినిమా వాళ్ల కన్నా బెటర్‌గా కనిపిస్తున్నారని మరికొందరు కామెంటారు. ఇంకొందరు హ్యాండ్‌సమ్ బ్రదర్ అంటూ కితాబిచ్చారు. ఒక నెటిజనేమో అన్నా, ఏ వయసులోనైనా యూత్ ఐకాన్‌లా ఉంటాడని.. ఇరవై సంవత్సరాల యువకుడిగా కనిపిస్తాడని పేర్కొన్నారు. ఇంకొకరేమో సింహం ఏ వయసులో ఉన్న సింహమే అంటూ వ్యాఖ్యానించారు. మరొకరు సూపర్.. రియల్ పొలిటికల్ మ్యాన్ అంటూ పొగిడేశారు.

అప్పట్లో కూడా ఓసారి ఇలాగే న్యూ స్టైల్..! అదరగొట్టారు

అప్పట్లో కూడా ఓసారి ఇలాగే న్యూ స్టైల్..! అదరగొట్టారు

అదలావుంటే 2016లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సడెన్లీ కొత్త రూపంలో దర్శనమిచ్చారు. ఎప్పుడూ జుట్టును పైకి దువ్వే తారకరాముడు సైడుకు దువ్వి ప్రత్యేకంగా కనిపించారు. గ్రేటర్ ఎన్నికల వేళ అలా స్టైలిష్‌గా కనిపించిన కేటీఆర్ అందర్నీ ఆకట్టుకున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా బంజారాహిల్స్ లోని తన నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సమయంలో అలా కొత్తగా కనిపించి అదుర్స్ అనిపించారు. అప్పట్లో ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. తండ్రి కేసీఆర్ లాగే ఆయన కూడా సైడుకు దువ్వి ఆశ్చర్యపరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+