Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెట్రో ధరలు పెంచొద్దని హెచ్చరించాం: కేటీఆర్, పాతబస్తీకి మెట్రోపై స్పష్టత

మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోబోమని.. ఇప్పటికే వారిని హెచ్చరించినట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్: మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోబోమని.. ఇప్పటికే వారిని హెచ్చరించినట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు పద్దులపై చర్చ జరుగుతోంది. మెట్రో పనులు, జీహెచ్ఎంసీ అభివృద్ధి, నాలాల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు.

హైదరాబాద్ నగరంలో రూ. 985 కోట్లతో నాలాల అభివృద్ధి చేపడుతున్నామని కేటీఆర్ తెలిపారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం-ఎస్ఎన్డీపీలో భాగంగా నగరం నలుమూలల మురుగునీటి వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. తొలి దశలో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చామని కేటీఆర్ వివరించారు. కొన్ని పనులు పూర్తి కావడంతో.. ఎల్బీనగర్‌లోని కొన్ని కాలనీల్లో గత వర్షకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గిందని తెలిపారు.

KTR on hyderabad metro charges hike and metro rail to old city.

హైదరాబాద్‌లో మెట్రో నూతన మార్గాల ఏర్పాటుకు కేంద్రం మోకాలడ్డుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్రాలకే నిధులు విడుదల చేస్తోందని.. తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. మెట్రో టిక్కెట్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోబోమని ఇప్పటికే హెచ్చరించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీతో సమానంగా ఉండాలని మట్రో అధికారులకు సూచించామన్నారు.

మెట్రోలో ఏడీఎస్ ఉండాలన్న నిర్ణయం కాంగ్రెస్ హయాంలోనిదని కేటీఆర్ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. హైదరాబాద్ అంటే చార్మినార్ అని అందరికీ తెలుసని, పాతబస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+