గురిచూసి కొట్టు.. విజయం పట్టు.. కేటీఆర్ ఫోటో వైరల్
హైదరాబాద్ : టీఆర్ఎస్ యంగ్ లీడర్ కేటీఆర్ ట్విటర్ వేదికగా పెట్టిన ఓ ఫోటో వైరల్ గా మారింది. తుపాకీ చేతబట్టి గురిచూసి కొడుతున్నట్లుగా ఉన్న ఆ ఫోటో.. ఎన్నికల ఫలితాల వేళ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే వేల సంఖ్యలో లైకులు, రీట్వీట్లు రావడం విశేషం. కేటీఆర్ గురిచూసి కొడుతున్నారు.. గెలుపు టీఆర్ఎస్ దే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖుల ట్వీట్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. కేటీఆర్ ఫోటోపై సినిమా రచయిత, నిర్మాత కోన వెంకట్ ట్వీట్ చేశారు. ఈ ఒక్కటి చాలు బ్రదర్, ఫలితాలు ఎలా వస్తాయో చెప్పడానికి, శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు. అటు దర్శకుడు హరీశ్ శంకర్ కూడా స్పందించారు.

ఈ ఫోటో ఆత్మవిశ్వాసానికి కొత్త అర్థం చెబుతోందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు కౌంటింగ్ సరళి ఏ పార్టీకి అనుకూలమనేది 11.00 - 11.30 సమయంలో తెలుస్తుంది. కానీ అంతకుముందుగానే తేలిపోవడం "ప్రజాస్వామ్య పవర్" కు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications