పవన్ కళ్యాణ్ కాదు నాగార్జున: ట్విట్టర్‌లో కేటీఆర్ యంగ్ ఫొటోపై నెటిజన్ల కామెంట్లు
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా ఓ పాత ఫోటొను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తన మొదటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇదేనంటూ పేర్కొన్నారు. 1998లో ఈ లైసెన్‌ను తీసుకున్నట్లు వ్యాఖ్యానించారు.

యంగ్ కేటీఆర్..
కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్న ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌పై ఉన్న ఫొటోలో ఆయన యువకుడిగా ఉన్నారు. దీంతో ఈ ట్వీట్‌కు అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. చాలా స్మార్ట్‌గా ఉన్నారంటూ కొందరు.. డైనమిక్‌గా ఉన్నారని మరికొందరు అభిమానులు పేర్కొంటున్నారు.

పవన్ కళ్యాణ్ అంటూ..
మరికొందరు అభిమానులైతే ప్రముఖ టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లా ఉన్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తమ్ముడు సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అలానే ఉన్నారని చెబుతున్నారు. హఠాత్తుగా చూస్తే తాము పవన్ కళ్యాణ్ అనుకున్నామని వ్యాఖ్యానిస్తున్నారు.

నాగార్జున అంటూ..
ఇంకొందరు అభిమానులైతే మరో సినీ హీరో నాగార్జునలా ఉన్నారంటూ చెబుతున్నారు. ఎంతో అమాయకంగా కనిపిస్తున్నారని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. సినిమా హీరో అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నావంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే సమయంలో మీ తండ్రి కేసీఆరే రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కదా అంటూ మరో నెటిజన్ ప్రశ్నించారు.
హీరోలెక్క ఉన్నవన్న..
లుకింగ్ స్మార్ట్, క్యూట్ అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మీ హెయిర్ స్టైల్ బాగుందంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. హీరో లెక్క ఉన్నవన్న అంటూ చెబుతున్నారు. లవ్ ఫ్రమ్ ఏపీ అంటూ ఏపీకి చెందినవారు కూడా స్పందిస్తున్నారు. యూత్ ఐకాన్, శోభన్ బాబు, బాలీవుడ్ హీరో అంటూ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుత్తున్నారు.












Click it and Unblock the Notifications