కేటీఆర్ వర్సెస్ భట్టి : సభలో హీట్ పెంచిన ఆ కామెంట్, క్షమాపణకు డిమాండ్, భట్టి నో
హైదరాబాద్ : బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, సీఎం కేసీఆర్, మంత్రుల మధ్య హాట్ హాట్ చర్చ జరిగింది. ప్రాజెక్టుల వ్యయం, పూర్తిచేయకపోవడంపై భట్టి ప్రశ్నించారు. మేడిగడ్డ నుంచి చుక్క నీరు రాలేదని భట్టి అనడంతో తెలంగాణ మంత్రులంతా స్పందించారు.

చుక్కనీరివ్వలేదు ...
మేడిగడ్డ నుంచి చుక్కనీరు కూడా పంప్ చేయలేదన్నారు భట్టి విక్రమార్క. ఆ 12 టీఎంసీలను అన్నారం లిఫ్ట్ నుంచి తీసుకొచ్చారని .. అన్నారం లిప్ట్‌కు సుందిళ్ల నుంచి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి కల్పించుకొన్నారు. ఎల్ ఎండీ, వరదకాలు, శ్రీపాద ఎల్లంపల్లి వరకు నీరు వచ్చిందని .. దారి పొడవునా చెరువులను నింపామని పేర్కొన్నారు. ఎల్ ఎం డీ 15 టీఎంసీలు, చెరువులకు 10 టీఎంసీలు లిప్ట్ చేశామని పేర్కొన్నారు. మరో మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ ఎల్లంపల్లి వరద వచ్చేసరికే మిడ్ మానేరు నిండిపోయిందని చెప్పారు. 22 ఏళ్ల క్రితం నిండని చెరువులను 120 చెరువులకు జలకళ వచ్చిందన్నారు. ఇందుకు తానే సాక్షి అని పేర్కొన్నారు.

అదీ కాదు ..
మంత్రుల వాదనతో భట్టి విభేదించారు. కళ్ల నిండ చూశారు కానీ .. వరద రాగానే విడుదల చేశారని చెప్పారు. తాను చెప్పే అంశాలకు సంబంధించి రికార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. పాత ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. తర్వాత మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారని భట్టి అనడంతో .. మంత్రి కేటీఆర్ కల్పించుకున్నారు. భట్టి అసత్యాలను వల్లెవేస్తున్నారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. దానికి సంబంధించి రుజువు చేయాలని కోరారు. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, మంత్రులు, సభకు సమాధానం చెప్పాలన్నారు. ఇరిగేషన్, బడ్జెట్, ఉద్యోగాల పేరుతో అసత్యాలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.

కేటీఆర్ వర్సెస్ భట్టి
కేటీఆర్‌కు కూడా భట్టి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తానేమి బానిసను కాదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని .. బహిరంగ సభల్లో కేసీఆర్ చెప్పినా విషయాన్ని గుర్తుచేశారు. సభలో బెదిరించడం ఏంటి అని .. ఇది కరెక్ట్ కదాన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్ష 7 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినా విషయం మరచిపోయారా అని నిలదీశారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications