హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రేపట్నుంచి మహిళల కోసం అందుబాటులోకి ప్రత్యేక బస్సు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఐటీ కారిడార్‌లో మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల కోసం 'మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లేడీస్‌ స్పెషల్‌' బస్సును సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి వేవ్‌ రాక్‌ వరకు పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా నడవనుంది.

హైదరాబాద్‌ నగర పరిధిలో ఉన్న ఐటీ కంపెనీల్లో దాదాపు 4 లక్షల మంది వరకు మహిళా ఉద్యోగులు పని చేస్తున్నట్లుగా అంచనా. వారి కోసం ప్రత్యేకంగా బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పెలైట్‌ ప్రాజెక్టుగా సోమవారం నుంచి బస్‌ను నడుపనుంది.

 Ladies special rtc bus from tomorrow in Hyderabad IT corridor route.

ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి ఉదయం 9.05 గంటల నుంచి బయలుదేరి.. నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఎక్స్‌రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వెళ్తుంది.

తిరిగి సాయంత్రం 5.50 గంటలకు వేవ్‌ రాక్‌ నుంచి ఆయా మార్గాల ద్వారా జేఎన్‌టీయూకు చేరుకుంటుంది. ప్రయోగాత్మకంగా నడుపుతున్న సర్వీసు విజయవంతమైతే మరిన్ని మార్గాల్లో నడిపించాలని ఆర్టీసీ భావిస్తోంది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ప్రత్యేక బస్సును మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు.

సైబర్ మోసాలతో జాగ్రత్త: సజ్జనార్

సైబర్ మోసాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్. సైబర్‌ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. తక్కువ పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశచూపి నిలువునా ముంచుతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఉదంతమిది. అధిక డబ్బుకు ఆశపడి ఓగ్రామంలో 200 మంది దాదాపు రూ.2 కోట్ల వరకు డబ్బు చెల్లించడం గమనార్హం.

ఇలాంటి మోసాలు గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతూనే ఉన్నాయి. ఇలా కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. మోసపోతున్నా ప్రజల్లో మాత్రం అత్యాశ వీడటం లేదు. మోసపూరిత యాప్‌ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మోసపోయాక బాధపడితే లాభం ఉండదు. ముందే మేల్కొని ఈ తరహా సంస్థలపై పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+