మంత్రి గారి డ్యాన్స్.. అదిరేటి స్టెప్పులు.. ఆలుగడ్డ శీనన్న గతం గుర్తు చేశారుగా..! (వీడియో)
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక బోనాల జాతర. గ్రామ దేవతలను కొలిచి మొక్కుతూ సల్లంగా చూడమ్మా అంటూ చిన్నా పెద్దా వేడుకలా జరుపుకునే అతి గొప్ప పండుగ. వ్యాధులు దరిచేరకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మవారి అంశలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మలను కొలుస్తూ నిర్వహించే బోనాల వేడుకలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయనడంలో అతిశయోక్తి లేదు.
ఈ ఉత్సవంలో భాగంగా అమ్మోర్లకు బోనాలు సమర్పించడం, యాటలు కోయడం, చిన్నా పెద్దా చిందులేయడం ఆనవాయితీగా వస్తోంది. పల్లె సమైక్య జీవన విధానాన్ని చాటి అందరూ ఐక్యమత్యంగా ఉండాలని ప్రబోధించేదే బోనాల వేడుక. ఆ క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో జరిగే బోనాల వేడుకలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలియాస్ ఆలుగడ్డ శీను ఆధ్వర్యంలో బోనాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఉజ్జయినీ మహాంకాళి బోనాల జాతర సందర్భంగా ఆదయ్య నగర్‌లో ఏర్పాటు చేసిన పలహారపు బండి ఊరేగింపు కార్యక్రమంలో డ్యాన్స్ చేసి అదుర్స్ అనిపించారు మంత్రి.
లష్కర్ బోనాల్లో ఆలుగడ్డ శీను కిరాక్ డ్యాన్స్.. గతం గుర్తు చేశారుగా మంత్రిగారు..! pic.twitter.com/0oXjnFLqfr
— Oneindia Telugu (@oneindiatelugu) July 23, 2019
డప్పుచప్పుళ్లకు అనుగుణంగా స్టెప్పులేశారు తలసాని. వయసు మీద పడ్డా అది ఏమాత్రం కనిపించకుండా యువకుడిలా చిందులేశారు. అనుచరుల కేకల మధ్య మరింత ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. చిన్నప్పటి నుంచే బోనాల జాతరలో డ్యాన్సులు చేసి అదరగొట్టిన తలసాని.. ఇప్పుడు మంత్రి హోదాలో స్టెప్పులేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.












Click it and Unblock the Notifications