హైదరాబాద్ మియాపూర్‌లో చిరుత సంచారం (వీడియో)
హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో చిరుత సంచారం కలకలం రేపింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుకవైపు శుక్రవారం రాత్రి చిరుత సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆనవాళ్లు సేకరిస్తున్నారు.
చిరుత సంచారాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కనిపించింది లియోపార్డ్ గానీ జాగ్వార్ గానీ అయి ఉండవచ్చని చీతా కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మనదేశంలో చీతాలు కేవలం వైల్డ్ ఫారెస్ట్ లో మాత్రమే ఉంటాయని చెబుతున్నారు.

కాగా, హైదరాబాద్ నగర శివార్లలో చిరుతలు సంచరించిన ఘటనలు గతంలోనే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయం రన్ వేపై ఈ ఏడాది మే నెలలో చిరుత కనిపించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. రన్ వేపై చిరుతను గుర్తించిన పెట్రోలింగ్ సిబ్బంది.. ఎయిర్ పోర్ట్ అధికారులు, అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో చిరుతను పట్టుకునేందుకు అధికారులు గస్తీ ఆపరేషన్ నిర్వహించారు.
హైదరాబాదు: మియాపూర్ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాలలో చిరుత సంచారం#Miyapur #MiyapurMetroStaion #Hyderabad #Cheetah #Oneindiatelugu pic.twitter.com/LaQjfoZwSI
— oneindiatelugu (@oneindiatelugu) October 18, 2024
చిరుత ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో 25 అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు మేకలను ఎరగా వేసి ఐదు బోన్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మేకను తినేందుకు వచ్చిన చిరుత బోనులో బందీ అయ్యింది. దీంతో ఆ చిరుతను నెహ్రూ జూ పార్క్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications