ఎరులైపారిన లిక్కర్: తెలంగాణలో రూ.172 కోట్లు, ఏపీలో రూ.124 కోట్ల మద్యం విక్రయం
ఓల్డ్ ఇయర్‌కు గుడ్ బై చెప్పి.. న్యూ ఇయర్‌కు వెల్ కం చెప్పే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మద్య ప్రవాహం కొనసాగింది. ఒక్కరోజులో తెలంగాణ, ఏపీ ఎక్సైజ్ శాఖలకు భారీగా ఆదాయం సమకూరింది. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతించడం కూడా విక్రయాలకు కలిసొచ్చింది. డిసెంబరు 31న తెలంగాణలో 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. మొత్తం రూ.172 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. అదే ఏపీలోనూ ఇదే తీరు కనిపించింది. మద్యం ప్రియులు 1.36 లక్షల కేసుల లిక్కర్, 53 వేల కేసుల బీర్లు కొనుగోలు చేశారు. మొత్తం రూ.124 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ప్రీమియం బ్రాండ్లు కూడా అమ్మకానికి ఉంచడంతో ఏపీలో మందుబాబులు వైన్ షాపులకు పోటెత్తారు.
Recommended Video
మద్యం తాగితే ఊరికే ఊంటారా.. బయటకు రావడం కామనే కదా.. ఇంకేముంది డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. రాత్రి మొత్తం మందుబాబులు చేసిన హడావుడికి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకూ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మందుబాబులను కంట్రోల్ చేసేందుకు హైదరాబాద్‌లో గల మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. ఒక్క రాత్రిలో రికార్డ్ స్థాయిలో 3,416 కేసులను నమోదు చేశారు. అత్యధికంగా సైబరాబాద్ పరిధిలో 1,528, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,258, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులను నమోదు చేసినట్టు చెప్పారు. మొత్తం 265 బృందాలతో తనిఖీలు చేశామన్నారు.

రాష్ట్రంలో మద్యం ఎరులై పారింది. గత నెలలో కూడా మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ శుక్రవారం సాయంత్రం వరకు రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి. మందుబాబులు సరికొత్త రికార్డ్స్ నెలకొల్పారు. రూ. 3 వేల 350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. లాక్ డౌన్ సమయంలోనే ఇబ్బందులు తప్పలేవు. వైన్స్ మూయడం వల్ల.. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయింది. ఆ తర్వాత మెల్లగా వైన్స్ తెరిచారు.












Click it and Unblock the Notifications