ఊపిరితిత్తుల్లో వక్క ముక్క.. చావు బతుకుల మధ్య పసి ప్రాణం..

చిన్నపిల్లలు ఆడుకుంటూ నోట్లో వేసుకునే చిన్న చిన్న వస్తువులు ఎంతటి ప్రాణాంతకంగా మారుతాయో హెచ్చరించే ఒక అత్యంత అరుదైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. నాలుగేళ్ల బాలుడు అనుకోకుండా మింగిన ఒక చిన్న వక్క ముక్క ఏకంగా అతని ప్రాణాల మీదికి తెచ్చింది. అది కాస్తా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇరుక్కుపోవడంతో, నెల రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఆ చిన్నారి చివరకు శ్వాస అందక మరణం అంచుల్లోకి చేరుకున్నాడు. అయితే ఫరీదాబాద్‌లోని అమృతా హాస్పిటల్ వైద్య నిపుణులు అత్యంత సంక్లిష్టమైన సర్జరీ చేసి ఆ వక్క ముక్కను బయటకు తీసి, ఆ బాలుడికి పునర్జన్మ ప్రసాదించారు.

అసలు కథ నెల రోజుల క్రితం మొదలైంది. ఆ నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ ఒక వక్క ముక్కను శ్వాసనాళాల్లోకి పీల్చుకున్నాడు. అయితే బాలుడి కుటుంబ సభ్యులతో పాటు మొదట సంప్రదించిన స్థానిక వైద్యులు కూడా ఊపిరితిత్తుల్లో ఏదో వస్తువు ఇరుక్కుపోయి ఉంటుందని కనీసం అనుమానించలేదు. దీనివల్ల ఆ బాబు నెల రోజులకు పైగా తీవ్రమైన దగ్గు, పదే పదే వచ్చే జ్వరంతో నరకం చూశాడు. వైద్యులు యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో, ఆఖరికి ఆ బాలుడికి టీబీ (క్షయ) వ్యాధి వచ్చి ఉంటుందని భావించి యాంటీ-ట్యుబెర్క్యులర్ మందులు కూడా వాడటం గమనార్హం.

Betel Nut Lodged In Child s Lung For Month Removed Safely By Doctors At Amrita Hospital Faridabad

పాడైపోయిన ఎడమ ఊపిరితిత్తి!

నిజానికి ఆ వక్క ముక్క మొదట కుడి శ్వాసనాళంలో న్యుమోనియాను కలుగజేసి, ఆ తర్వాత మెల్లగా ఎడమ శ్వాసనాళంలోకి జారి అక్కడ గట్టిగా ఇరుక్కుపోయింది. ఈ అడ్డంకి వల్ల ఎడమ ఊపిరితిత్తికి గాలి అందడం పూర్తిగా నిలిచిపోయి, ఇన్ఫెక్షన్ సోకి ఆ ఊపిరితిత్తి పూర్తిగా పాడైపోయింది (Collapse). దీంతో బాలుడి పరిస్థితి విషమించి శ్వాస తీసుకోలేకపోవడంతో అతడిని వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది. అమృతా హాస్పిటల్‌కు తీసుకువచ్చే సమయానికి, బాబుకు 100% ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తున్నప్పటికీ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

కళ్లు చెమర్చే నిజం: శిథిలాలు దాచిన ప్రాణం, 18 రోజుల మృత్యుంజయురాలు!
కళ్లు చెమర్చే నిజం: శిథిలాలు దాచిన ప్రాణం, 18 రోజుల మృత్యుంజయురాలు!

'క్రయోప్రోబ్'తో ప్రాణం పోశారు..

కేసు అత్యంత క్లిష్టమైనదని గ్రహించిన పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, అనస్థీషియా, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ నిపుణుల బృందం తక్షణమే రంగంలోకి దిగింది. "ఇది చాలా క్రిటికల్ కేసు, శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోయింది. మాకు ప్రతి నిమిషం ఎంతో విలువైనది" అని సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సౌరభ్ పహూజా తెలిపారు. వైద్యులు అత్యాధునిక శ్వాసనాళ పరికరాలతో పాటు 'క్రయోప్రోబ్' (అత్యంత చల్లదనంతో వస్తువులను అంటుకునేలా చేసే ప్రత్యేక సాధనం) సాంకేతికతను ఉపయోగించారు. దట్టమైన వాపు కణజాలం, చీము మధ్య ఇరుక్కుపోయిన ఆ వక్క ముక్కను విజయవంతంగా బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత బాలుడి ఊపిరితిత్తి మళ్లీ యథాస్థితికి చేరుకుంది. వెంటిలేటర్ తొలగించడంతో ఆ చిన్నారి పూర్తిగా కోలుకుని నవ్వుతూ ఇంటికి వెళ్ళాడు.

ప్రపంచాన్ని కాపాడబోతున్న ఏఐ టీకా! వైద్య శాస్త్రంలో అద్భుతం..
ప్రపంచాన్ని కాపాడబోతున్న ఏఐ టీకా! వైద్య శాస్త్రంలో అద్భుతం..

తల్లిదండ్రులకు వైద్యుల హెచ్చరిక!

ఈ ప్రమాదం నేపథ్యంలో డాక్టర్ పహూజా బృందం తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఐదేళ్లలోపు పిల్లలు ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుని ప్రపంచాన్ని అన్వేషిస్తుంటారు, కాబట్టి వారిపై నిరంతరం నిఘా ఉంచాలి. ఐదేళ్ల లోపు పిల్లలకు హోల్ నట్స్ (జీడిపప్పు, బాదం వంటివి), వక్కలు, గింజలు వంటివి అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ పిల్లలు ఏదైనా మింగి ఊపిరాడక ఇబ్బంది పడి, ఆ తర్వాత తగ్గినట్లు అనిపించినా సరే.. పదే పదే దగ్గు వస్తున్నా, న్యుమోనియా లక్షణాలు కనిపిస్తున్నా అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి అత్యవసర సమయాల్లో అధునాతన శ్వాసనాళ చికిత్స సౌకర్యాలు ఉన్న ఆసుపత్రులను ఆశ్రయించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+