Kalvakuntla Kavitha: జైలుకు వెళ్లడానికైనా సిద్ధం - చేసేదేమీ లేదు: కవిత సంచలనం..!!

Kalvakuntla Kavitha: సీఎం కేసీఆర్ కుమార్తె..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించింది. అదే సమయంలో వంద కోట్ల మేర ఆప్ నేతలకు ముడుపులు ఇచ్చిన వారిలో కవిత ఉన్నారని..వారు ఫోన్లు డిజిటల్ ఎవిడెన్స్ దొరక్కుండా ఫోన్లు ధ్వసం చేసారని పేర్కొంది. దీని పైన కవిత సీరియస్ గా స్పందించారు. కవిత పేరు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావనతో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు..అభిమానులు కవిత నివాసానికి చేరుకున్నారు. విచారణకు సహకరిస్తామని కవిత స్పష్టం చేసారు.

కేసులు పెట్టుకోండి..జైలుకు సిద్దం

కేసులు పెట్టుకోండి..జైలుకు సిద్దం

ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరు పైన కవిత మండిపడ్డారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయిందన్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో తొమ్మది ప్రభుత్వాలను కూల్చారని ఆరోపించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మోదీ కంటే ముందు ఈడీ రావటం సర్వ సాధారణ అంశంగా మారిందని చెప్పారు. తెలంగాణలో మరో ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయని..రాజకీయ కుట్రలో భాగంగానే తన పైనా..తన పార్టీ నేతల పైన సీబీఐ..ఈడీ కేసులు నమోదవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఏజెన్సీలు నమోదు చేసిన కేసులను ఎదుర్కొంటామని..విచారణకు సహకరిస్తామని కవిత వెల్లడించారు. ఎటువంటి సమాచారం కావాలన్నా ఇవ్వటానికి సిద్దమని కవిత స్పష్టం చేసారు. సీబీఐ..ఈడీ..మోదీ అన్నింటిని ఎదుర్కొనే సత్తా తమకు ఉందని కవిత ధీమా వ్యక్తం చేసారు.

ఏజెన్సీల విచారణకు సహకరిస్తాం..

ఏజెన్సీల విచారణకు సహకరిస్తాం..

రాజకీయ దురుద్దేశంతో తమ పైన కేసులు పెట్టిన ఏజెన్సీలు విచారణకు వస్తే సమాధానం చెబుతామని కవిత వెల్లడించారు. రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్య బద్దంగా అధికారంలోకి రావాలి కానీ, ఈ విధంగా ఎజెన్సీలతో కేసులు ..విచారణలతో భయ పెట్టలేరని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం ఏం జరుగుతుందో పూర్తిగా అవగాహన ఉన్న చైతన్యవంతమైన సమాజమని వివరించారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా తన పంథా మార్చుకోవాలని కవిత కోరారు. కేసులు పెట్టి వేధిస్తామంటే భయపడేది లేదని కవిత స్పష్టం చేసారు. జైళ్లో పెట్టాలనేదే వారి ఆలోచన అయితే, తాము సిద్దమన్నారు. అంతేకానీ, మోదీ.. ఈడీ లకు భయపడేదే లేదని కవిత చెప్పుకొచ్చారు.

కవితకు మద్దతుగా తరలి వచ్చిన కార్యకర్తలు

ముందుగా లక్ష్యంగా చేసుకున్న వారి పేర్లను లీకులు ఇస్తూ..డామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కవిత ఆరోపించారు. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించటం తో పార్టీ నేతలు కవిత నివాసం కు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రాజకీయంగా చేసిన టార్గెట్ లో భాగంగానే కవిత పేరు ప్రస్తావించారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇక, ఇప్పుడు కవిత విచారణకు సిద్దమని చెబుతూనే.. జైలుకు వెళ్లటానికైనా రెడీ అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో వైరల్ అవుతున్నాయి. దీని పైన ఇప్పుడు బీజేపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+