మరో వారం పొడగింపు.. లాక్ డౌన్‌పై సంకేతాలు... ఆ తర్వాత సడలింపులే..?
కరోనా విలయ తాండవం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అమల్లోకి వచ్చింది. మే 12వ తేదీ నుంచి ఆంక్షలు కొనసాగుతున్నాయి. తొలుత 10 రోజులు తర్వాత మరో వారం పొడగించారు. దీంతో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మరో వారం రోజులు లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

మరో వారం లాక్ డౌన్
తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ మరో వారం రోజులు పొడిగించే అవకాశం ఉంది. కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ పొడిగించక తప్పదని వైద్యశాఖ భావిస్తోంది. ఇప్పటికే వాణిజ్య, ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం సంకేతాలిచ్చినట్లు తెలియవచ్చింది. లాక్ డౌన్ కరోనా నియంత్రణపై ఈనెల 28న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. వైద్యశాఖ అభిప్రాయం మేరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారం వరకు లాక్ డౌన్ పొడిగించాలని మెజారిటీ రాష్ట్రాలు భావిస్తున్నాయి.

12వ తేదీ నుంచి లాక్ డౌన్
కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణలో ఈ నెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో పాజిటీవ్ కేసులు ఆశించిన మేరకు తగ్గినట్లు కనిపించలేదు. లాక్ డౌన్‌తో కేసుల సంఖ్య కొంతవరకు తగ్గింది. ప్రస్తుతం తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలియవచ్చింది.

గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం
వ్యాక్సినేషన్లను దిగుమతి చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు ఆహ్వానించింది. జూన్ మొదటి వారంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్ద మొత్తంలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో లాక్ డౌన్‌ను మరికొన్ని రోజులపాటు పొడిగిస్తే మంచిదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలియవచ్చింది.
అందుకోసమే పొడగింపుపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ టెన్షన్ ఉంది. దీనికి తోడు ఎల్లో ఫంగస్ కూడా వచ్చింది. ఇదీ వాటి కన్నా డేంజర్ అని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణం చల్లబడే వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications