Heart Attack's: చిన్న వయస్సులోనే గుండె పోటుతో మృతి.. కలవరపెడుతున్న యువత మరణాలు..
తెలుగు రాష్ట్రాల్లోని యువతలో వరుసగా గుండె పోట్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ లో ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ సడెన్ గా కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతడి వయస్సు 25 ఏళ్ల లోపే ఉంది. మరో ఘటనలో ఓ వ్యక్తి హల్ది ఫంక్షన్ కు హాజరయ్యాడు. పెళ్లి కొడకుకు పసుపు రాసేందుకు సిద్ధమయ్యాడు. ఈలోపే అతని కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. కొద్ది రోజుల చికిత్స అనంతరం మృతి చెందాడు.
షటిల్ ఆడుతూ
ఆ తర్వాత హైదరాబాద్ లాలాపేటలో ఓ వ్యక్తి షటిల్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. అతను గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. రెండు రోజుల క్రితం అమెరికాలో మెడిసిన్ చేస్తున్న నిజామాబాద్ కు చెందిన పూజిత రెడ్డి గుండె పోటుతో మృతి చెందారు. ఆమె వయస్సు కేవలం 24 ఏళ్లే.. తాజాగా ఏపీ అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీ-ఫార్మసి చదువుతున్న తనూజ్‌నాయక్ అనే 19 ఏళ్ల విద్యార్ మార్చి 1న కబడ్డీ ఆడుతూ కిందపడిపోయాడు.
కబడ్డీ ఆడుతూ
అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ తనూజ్ నాయక్ మృతి చెందాడు. తాజాగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన 17 ఏళ్ల ఫిరోజ్‌ఖాన్ చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి చదువుకుని పడుకున్నాడు.
గురక
అతను అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెద్దగా గురక పెడుతుండడంతో పక్కనే ఉన్న సోదరి ఫర్జానా భయపడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు అతడిని తట్టి లేపగా లేవలేదు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇలా చాలా చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడం కలవరపెడుతోంది. అయితే కొవిడ్ వ్యాక్సిన్ వెసుకున్న తర్వాతే ఇలా జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. కానీ దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications