Hyderabad: హైదరాబాద్ నుంచి ఏ దేశానికి విమాన సర్వీసులున్నాయంటే..
లుఫ్తాన్స జర్మన్ ఎయిర్‌లైన్స్ ఇటీవల హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ తో సహా ప్రధాన బహుళజాతి కంపెనీలున్న దేశంలో నాల్గో-అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఉంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక, ఏరోస్పేస్, భారతీయ ఫార్మా హబ్ అయిన హైదరాబాద్ నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు నేరుగా విమాన సర్వీసులున్నాయి.
హైదరాబాద్ నుంచి దుబాయ్, మస్కట్, దోహా, అబూ ధాబీ, జెడ్డా, సింగపూర్, కౌలాలంపూర్, దమ్మామ్, షార్జా, రియాద్, కువైట్, కొలంబో, బహ్రెయిన్, బ్యాంకాక్, లండన్, ఢాకా, హాంగ్ కాంగ్,ఫ్రాంక్‌ఫర్ట్, బ్యాంకాక్, రాస్ అల్ ఖైమా విమాన సర్వీసులు ఉన్నాయి.
హైదరాబాద్ RGI, వివిధ దేశాలకు ప్రత్యక్ష విమాన సర్వీసులు అందిస్తోంది. ఈ ఎయిర్ పోర్ట్ డిసెంబర్ 2023లో అత్యధిక నెలవారీ ట్రాఫిక్‌ను నమోదు చేసింది.

ఆ నెలలో 2.3 మిలియన్ల మంది ప్రయాణికులు విమానాశ్రయం నుంచి ప్రయాణించారు. విమానాశ్రయం నెలవారీగా 11 శాతం పెరుగుదల ఉండగా.. ఆ నెలలో 18 శాతం వృద్ధిని సాధించింది. ఇది డిసెంబర్ 23, 2023న అత్యధిక సింగిల్-డే ప్యాసింజర్ ట్రాఫిక్‌ను నమోదు చేసింది. ఆ రోజు 0.77 మిలియన్ల మంది ప్రయాణించారు. సమీప భవిష్యత్తులో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇతర దేశాలకు నేరుగా విమానాలు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications