కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో మహారాష్ట్ర పార్టీ విలీనం

హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(BRS)లో మరో పార్టీ విలీనం అయ్యింది. మహారాష్ట్రకు స్వరాజ్య మహిళ సంఘటన్ బీఆర్ఎస్‌లో విలీనమైంది. స్వరాజ్య మహిళ సంఘటన్ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే, సభ్యులు కలిసి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.

మహారాష్ట్ర బీజేపీ నాయకులు భయ్యా సాహెల్ పాటిల్, అర్జున్ వాంఖడే, ఎన్సీపీ కార్పొరేటర్ జయంత్ చౌదరి, శివసేన నాయకుడు దత్తరాజ్ దేశ్‌ముఖ్ తదితరులు కూడా బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణలోని మహిళా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని.. ఇలాంటి విధానాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని బీఆర్ఎస్‌లో చేరిన స్వరాజ్య మహిళ సంఘటన్ అధ్యక్షురాలు వనితా తాయి తెలిపారు.

Maharashtra swarajya mahila sanghatana party merged in BRS.

సమాజంలోని పేదలు, పీడితులు, అసహాయులు, వితంతువుల సంక్షేమం, స్వావలంబన కోసం పనిచేస్తున్న స్వరాజ్య మహిళా సంఘటన ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని లక్ష్యంతో విలీన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ విధానాలను ముందుకు తీసుకుపోవడంలో పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలను చిత్తుశుద్ధితో పాటిస్తానని వనితా తాయి పేర్కొన్నారు. జీవితాంతం బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

స్వరాజ్య మహిళా సంఘటనతో పాటు మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నాయకులు మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు శంకర్న ధోండ్గే నేతృత్వంలో బీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు.

బుల్ధానా జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ వాంఖడే, స్టేట్ యూనియన్ వర్కర్ (సభ్యుడు) రామ్ రావ్ షిండే పాటిల్, బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ భయ్యా సాహెబ్ పాటిల్, పంచాయతీ సమితి సభాపతి సురేష్ మిస్రవ్, శంభాజీ బ్రిగేడ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ మొహాలే, కార్పోరేటర్, ఎన్సీపీ పార్టీ తాలూకా ప్రెసిడెంట్ జయంత్ చౌదరి, మహిళా అఘాడీకి చెందిన మనిషా చౌదరి, మహాగావ్ తాలూకా సభాపతి నరేంద్ర ఖదారే, శివసేన జిల్లా సచివ్ దత్తరాజ్ దేశ్ ముఖ్, లాహురావ్ మడ్కే, అషిప్ యాతల్, సునీల్ జాదవ్, సంతోష్ రాథోడ్ పార్టీలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+