వేణుస్వామితో మహేష్ బాబు పూజలు?
ఇటీవలి కాలంలో వేణుస్వామి గురించి ఎక్కువగా వింటున్నాం. సినిమా రంగంలోనివారికి, రాజకీయ రంగంలోనివారికి జాతకాలు చెబుతూ ఆయన కూడా ఒక సెలబ్రిటీలా మారిపోయారు. ఈయన పేరు గుర్తుకురాగానే సమంత-నాగచైతన్య గుర్తుకు వస్తారు. వీరిద్దరూ విడిపోతారని ఆయన చెప్పిన మాట నిజం కావడంతో అప్పటి నుంచి వేణుస్వామి గతంలో ఎవరి గురించి చెప్పారు? ఏం చెప్పారు? అంటూ నెటిజన్లు శోధించడం మొదలుపెట్టారు.
ప్రస్తుతం వేణుస్వామి, మహేష్ బాబుకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. మహేష్ బాబు కూడా వేణు స్వామితో పూజలు చేయించాడని.. అందుకే మహేష్ బాబు కెరీర్ ఒక వెలుగు వెలుగుతోందనేది ఆ వార్త సారాంశం. సూపర్ స్టార్ మహేష్ బాబు వేణుస్వామితో పూజలు చేయించుకోవడం ఏమిటని అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. ఇటువంటివాటిని సూపర్ స్టార్ నమ్ముతున్నాడా? అంటూ చర్చ నడుస్తోంది. ఇలా మాట్లాడుకుంటున్న తరుణంలోనే మహేష్ బాబు చేత వేణుస్వామి పూజలు చేయిస్తున్న ఫొటో వైరల్ గా మారింది.

మహేష్ బాబు హీరోగా చేసిన రెండో సినిమా యువరాజు. ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలో నిర్మాతలు వేణుస్వామిని పిలిపించారు. మహేష్ బాబుతో ఆయన పూజలు చేయించారు. వాటికి సంబంధించిన ఫొటో ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ గా మారింది. వ్యక్తిగతంగా మహేష్ బాబు వేణుస్వామితో ఎటువంటి పూజలు చేయించలేదని, సినిమా ప్రారంభానికి సంబంధించిన పూజ మాత్రమే చేయించారని తేలింది. దీంతో ప్రిన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో ఇటువంటివాటిని నమ్మడని, కేవలం శ్రమను నమ్ముకుంటాడంటూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications