మహేష్-రాజమౌళి.. జేమ్స్‌బాండ్ 007?
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం జేమ్స్ బాండ్ జోనర్‌లో తీయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మనకు జేమ్స్ బాండ్ 007 చిత్రాలు అంటే హాలీవుడ్‌లో తీస్తున్నవాటి వరకే తెలుసు. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోయే సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక సరికొత్త జేమ్స్ బాండ్‌ను రాజమౌళి ఆవిష్కరించబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిషు భాషలో విడుదల చేయబోతున్నారు.
జేమ్స్ బాండ్ క్యారెక్టర్‌కు మహేష్ బాబు సరిగా సరిపోతారు. రాజమౌళి పని కూడా సులువవుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ సినిమా అవగానే మహేష్ రాజమౌళి టీమ్‌లో చేరతారు. జేమ్స్ బాండ్ 007 సినిమాలు అనగానే కళ్లు చెదిరే సన్నివేశాలు, వాటి రూపకల్పనకు కోట్లరూపాయలు గుమ్మరించడం, సరికొత్త ఆయుధాలను చూపించేవారు. అంతేకాదు టెక్నాలజీని ఉపయోగించుకొని బాండ్ తన ప్రత్యర్థులపై ఎలా పైచేయి సాధిస్తారో కూడా ప్రతి సినిమాలో మనం చూస్తూనే ఉంటాం.

రాజమౌళి సినిమా అనగానే కథానాయకుడికి ప్రత్యేకంగా ఒక ఆయుధం ఉంటుంది. అది సరికొత్తగా ఉంటుంది. అలాగే జేమ్స్ బాండ్ మూవీకి సరికొత్త సాంకేతికను ఉపయోగించుకొని ఏ తరహా ఆయుధాలు, వాహనాలు రూపకల్పన చేయబోతున్నారోననే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ప్రపంచంలో కొత్తగా ఆవిష్కృతమవుతున్న ప్రతి టెక్నాలజీని తన సినిమాకు ఉపయోగించే రాజమౌళి ఈ సినిమాకు
ఇప్పటికే వీటిపై ఒక స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. ఆద్యంతం ఉత్కంఠ రేపేలా చిత్రీకరించబోతున్న ఈ సినిమాకు ఆఫ్రికా అడవుల్లో తీసే సన్నివేశాలు హైలైట్ అవుతాయని తెలుస్తోంది. అభిమానుల ఉత్కంఠకు తెరపడాలంటే కనీసం ఒక సంవత్సరకాలమన్నా వేచిచూడాల్సిందే. అప్పుడే ప్రపంచానికి ఒక సరికొత్త జేమ్స్ బాండ్ ఆవిష్కృతమయ్యేది..!!












Click it and Unblock the Notifications