Infertility: హైదరాబాదీలకు హెచ్చరిక.. పెరుగుతోన్న వంధ్యత్వ రేటు..!
ప్రస్తుతం.. వాతావరణం, తినే తిండితో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సంతాన లేమి సమస్యలు పెరుగుతోన్నాయి. గతంలో ఎక్కువగా మహిళలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ రోజుల్లో వంధ్యత్వ రేటు పెరుగుదలతో పురుషులు, మహిళలు ఇద్దరూ సమానంగా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో వంధ్యత్వ రేటు పెరుగుతుండడం కలవరానికి గురి చేస్తోంది.
సంతానలేమి కారణంగా గర్భం దాల్చేందుకు కష్టపడుతున్న జంటల సంఖ్య పెరుగుతుండటంపై నగరంలో ఉన్న జీనోమ్ ఫౌండేషన్ అనే గ్రూప్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీనోమ్ ఫౌండేషన్ ఎండీ కె.పి.సి. గాంధీ, ప్రసాద్ హాస్పిటల్స్ చెందిన సుమ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వి.సంధ్య, ఒయాసిస్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ నుంచి కృష్ణ చైతన్య, కిమ్స్ హాస్పిటల్స్ నుంచి స్త్రీ జననేంద్రియ నిపుణుడు వసుంధర సహా వివిధ వైద్య కేంద్రాల నిపుణులు పాల్గొన్నారు.

వేగవంతమైన జీవనశైలి మార్పులు, కాలుష్యం వంటి కారణాలతో మగవారికి సమస్యలు పెరుగుతోన్నాయని వారు హెచ్చరించారు. రోజువారీ ఉత్పత్తులలోని రసాయనాలు, ధూమపానం, మద్యపానం వంటి హానికరమైన అలవాట్లు జంటల గర్భం దాల్చే సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయని చెప్పారు. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, తగినంత నిద్రను పొందడం, శారీరకంగా చురుకుగా ఉండటం, బరువును నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలను అవలంబించడం ద్వాలు సంతనం కలిగే అవకాశాలను గణనీయంగా పెరుగుతాయన్నారు.
సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు వైద్యుల నుంచి సహాయం పొందాలని నిపుణులు సూచించారు.












Click it and Unblock the Notifications