హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డైరెక్టర్ రాజమౌళి RRRలో తల్లి వేషం మీదే.. 50 లక్షలు ఫసక్.. లాయర్‌కు కన్నం..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సినిమాల్లో ఛాన్స్ అన్నాడు. ఏకంగా డైరెక్టర్ రాజమౌళి పేరు వాడేశాడు. ఆయన తీసే కొత్త సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ కల్లిబొల్లి మాటలు చెప్పాడు. అలా దాదాపు 50 యాభై లక్షల రూపాయలు నొక్కేశాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మోసం చేసింది మామూలోడు.. మోసపోయింది మాత్రం లాయర్.

ఆ సినిమా సంగతేంటో గానీ ఈ కథలో మాత్రం మాంఛి స్క్రీన్ ప్లే అల్లేశాడు మోసగాడు. రాజమౌళి దర్శకుడు ఐతే.. తనకు తాను సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్నాడు. RRR మూవీలో తల్లి పాత్ర మీకే కన్ఫామ్ అంటూ మహిళా న్యాయవాదిని 50 లక్షలకు ముంచేశాడు.

సినిమాల్లో వేషం.. పెట్టాడుగా శఠగోపం..!

సినిమాల్లో వేషం.. పెట్టాడుగా శఠగోపం..!


హైదరాబాద్‌లో ఓ కలర్‌ ల్యాబ్‌లో పనిచేసే వీరబత్తిని నరేష్‌ కుమార్‌ అనే వ్యక్తి 73 ఏళ్ల మహిళా న్యాయవాదికి కుచ్చుటోపి పెట్టాడు. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలో తల్లి పాత్ర ఇప్పిస్తానంటూ 50 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఈజీమనీ కోసం వెంపర్లాడుతూ అడ్డదారులు తొక్కిన నరేశ్.. తనకు తాను ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా నిర్మాతగా ఆదిత్య పేరుతో పరిచయం చేసుకున్నాడు. తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఫోన్ ద్వారా సదరు లాయర్‌ను సంప్రదించాడు. ఆ క్రమంలో పరిచయం పెరగడంతో సినిమా ఛాన్స్ పేరిట ఆమెను బురిడీ కొట్టించాడు.

హోంమినిస్టర్‌ మనవడా మజాకా.. డీజీపీ కారుపైనే టిక్కుటాక్కు..!హోంమినిస్టర్‌ మనవడా మజాకా.. డీజీపీ కారుపైనే టిక్కుటాక్కు..!

రాజమౌళి సినిమా.. తల్లి వేషం.. లక్షలు మాయం..!

రాజమౌళి సినిమా.. తల్లి వేషం.. లక్షలు మాయం..!


రాజమౌళి సినిమా అనగానే మహిళా న్యాయవాది ఓకే చెప్పేశారు. దాంతో స్క్రీన్ టెస్ట్ తదితర పేర్లు చెప్పి దాదాపు నాలుగు నెలల్లో 50 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయితే ఆమె నుంచి సొమ్ము తీసుకునే క్రమంలో చాలా జాగ్రత్త పడ్డాడు సదరు మోసగాడు. ఒకవేళ విషయం బయటపడితే తాను పట్టబడకుండా చూసుకున్నాడు. ఆ క్రమంలో ఆ లాయర్ నుంచి కొంతమంది కారు డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయించుకున్నాడు.

వివిధ సందర్భాల్లో కార్లు అద్దెకు తీసుకున్న సదరు మోసగాడు రెండు మూడు రోజులు ఆ కార్లను వాడుకునేవాడు. తీరా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పడు తన దగ్గర ప్రస్తుతం లేవని వారి అకౌంట్ నెంబర్లు తీసుకునేవాడు. తనకు ఇతర వ్యక్తుల నుంచి డబ్బులు రావాల్సి ఉందని.. వారితో నేరుగా మీ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేపిస్తానని నమ్మించేవాడు. అలా చెప్పినట్లుగానే ఆ మహిళా న్యాయవాదితో ఆ కారు డ్రైవర్లకు డబ్బులు వేయించేవాడు. అనంతరం వారికి ఇవ్వాల్సిన డబ్బులు మినహాయించుకుని మిగతా మొత్తం నొక్కేసేవాడు. అలా 15 మంది డ్రైవర్లను వాడేశాడు.

4 నెలలు.. 50 లక్షలు.. వేషమేశాడుగా..!

4 నెలలు.. 50 లక్షలు.. వేషమేశాడుగా..!

నాలుగు నెలల వ్యవధిలో 50 లక్షలు గుంజిన సదరు మోసగాడు చివరకు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. షూటింగ్ ఎప్పుడంటూ ఆమె ప్రశ్నించినప్పుడల్లా అప్పుడు ఇప్పుడు అంటూ బుకాయించేవాడు. ఆ క్రమంలో ఆమె నుంచి వత్తిడి పెరగడంతో ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశాడు. అయితే తనను మోసం చేశాడంటూ సదరు లాయర్ బోయిన్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు.

అదలావుంటే నిందితుడు నరేశ్ జాడ దొరక్కపోవడంతో పోలీసులు రూట్ మార్చారు. ఇటీవల రామక‌ృష్ణ అనే డ్రైవర్ ఖాతాలో మహిళా న్యాయవాది డిపాజిట్ చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో దర్యాప్తు చేయగా నరేశ్ గురించి సమాచారం ఇచ్చాడు. ఆ క్రమంలో ప్రధాన నిందితుడు నరేశ్‌తో పాటు అతడికి సహకరించిన డ్రైవర్లు రామకృష్ణ, సోమన్నను అరెస్ట్ చేసి కొంత నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సదరు లాయర్‌ను మోసగించిన ప్రధాన నిందితుడు నరేశ్‌కు సహకరించిన ప్రతి ఒక్కరూ నిందితులేనంటూ పేర్కొన్నారు పోలీసులు. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

English summary
A Person Cheated Women Advocate in the name of movie chance. He Introduced him self as RRR telugu movie producer and promised that give a chance as mother role. He used the name of Famous Tollywood Director Rajamouli. Case filed against him and arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X