ఖాకీ కీచకం: పరారీలోనే సీఐ నాగేశ్వరరావు, రంగంలోకి దిగిన 4 బృందాలు
ఖా'కీచకుడు' సీఐ నాగేశ్వరరావు ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. మహిళపై అత్యాచారం చేసి, ఆమెతోపాటు భర్తను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. ఇప్పటికే అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. కానీ మారేడ్ పల్లి సీఐ నాగేశ్వర రావు మాత్రం ఏంచక్కా తప్పించుకు తిరుగుతున్నారు.

అరెస్ట్ చేయడానికి వస్తే..
వనస్ధలిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఆ వెంటనే అదుపులోకి తీసుకోటానికి రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు వద్దకు వచ్చారు. అప్పటికి ఆయన డ్యూటీలో ఉన్నారు. తాను రాత్రి డ్యూటీలో ఉన్నానని, రేపు ఉదయం వచ్చి లొంగిపోతానని ఎస్‌ఓటీ పోలీసులకు చెప్పారు. రాత్రి 12-15కు నార్త్ జోన్ పోలీసులు ఫోన్ చేయగా మొబైల్ స్విఛ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. రెండు రోజులగా పోలీసులకు అందుబాటులోకి రాకపోవటంతో నాగేశ్వర రావును పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

7వ తేదీన రేప్
వనస్ధలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో ఉండే మహిళపై ఈ నెల 7వ తేదీన రాత్రి 12 గంటలకు నాగేశ్వరరావు అత్యాచారం చేశాడు. అడ్డొచ్చిన ఆమె భర్తను గన్‌తో బెదిరించాడు. దంపతులను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద కారుకు యాక్సిడెంట్ కావడంతో బాధితులు తప్పించుకున్నారు. వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుకి ప్రమాదం జరగకుండా ఉంటే తమను సీఐ చంపేసి ఎక్కడో చోట పడేసేవాడని బాధితులు వాపోయారు. నాగేశ్వరరావుపై 8వ తేదీన తెల్లవారు ఝామున కేసు పెట్టారు.

పీఎస్‌కు వస్తే
న్యాయం చేయాలని హస్తినాపురానికి చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్ వచ్చాడు. అతని భార్యపై నాగేశ్వరరావు లైంగికదాడి చేశాడు. 2018లో ఓ కేసులో బాధిత వ్యక్తిని నాగేశ్వరరావు రిమాండ్ చేశాడు. ఇంటికి కూడా వెళ్లొద్దని, తన పొలం వద్దే పని చేయాలని కండీషన్స్ పెట్టాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాదు తాను లేని సమయంలో తన భార్యను బలవంతంగా పొలం వద్దకి తీసుకెళ్లడంతో గొడవ పడ్డానని చెప్పాడు.

మంచి పేరు.. అంతలోనే..
నాగేశ్వరరావు గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహించారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించాడు. అక్కడి నుంచి మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. కానీ ఇంతలోనే కీలక ఆరోపణలు రావడం.. సస్పెండ్ కావడం చకచకా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు పరారీలో ఉన్నాడు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications