హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రివర్స్ షాక్: కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ, ఆరేళ్లపాటు..

|
Google Oneindia TeluguNews

రేపో, మాపో బీజేపీలో చేరే పనిలో మర్రి శశిధర్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీలో అమిత్ షాను కలువడం, కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని కామెంట్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఈ మేరకు పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయనను ఆరేళ్లపాటు పార్టీ నుంచి క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేసింది. బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటోన్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి మర్రికి రివర్స్ షాక్ ఇచ్చింది.

రేవంత్‌పై హాట్ కామెంట్స్

రేవంత్‌పై హాట్ కామెంట్స్


రేవంత్ రెడ్డిపై ఇటీవల శశిధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కల్లోలానికి రేవంత్ కారణమని మండిపడ్డారు. పార్టీకి నష్టం కలిగించేలా ఆయన చేస్తున్న పనులు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ రేవంత్ రెడ్డి ఏజెంట్ మాదిరి పని చేస్తున్నారని విమర్శించారు. ఆ వెంటనే పార్టీ మార్పునకు సంబంధించిన పనుల్లో నిమగ్నం అయ్యారు.

పీజేఆర్‌తో కలిసి

పీజేఆర్‌తో కలిసి


కాంగ్రెస్ పార్టీలో శశిధర్ రెడ్డి కీలక నేత.. పీజేఆర్ ఉన్న సమయంలో బ్రదర్స్‌లా పనిచేశారు. వైఎస్ఆర్ ఉన్న సమయంలో కూడా వీరికి తగిన ప్రయారిటీ దక్కింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి.పీసీసీ చీఫ్‌లు మారారు. రాష్ట్రం వీడిపోయింది. అంతకుముందే పీజేఆర్ చనిపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో.. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో కీలక నేతగా శశిధర్ రెడ్డి ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవీ చేపట్టిన తర్వాత సీనియర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వీహెచ్ లాంటి సీనియర్ బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కానీ వీహెచ్.. పార్టీ వీడి.. మరో పార్టీలో చేరేది లేదు. అవకాశం ఉన్న.. శశిధర్ రెడ్డి మాత్రం పార్టీ వీడేందుకు సిద్దం అయ్యారు.

జగ్గారెడ్డి ఫైర్..

జగ్గారెడ్డి ఫైర్..


మర్రి పార్టీని వీడితే అంటూ కాసేపటి క్రితం జగ్గారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కను టార్గెట్ చేశారు. అయినప్పటికీ పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. బహిష్కరణ వేటు వేసింది. ఇక ఏ పార్టీలోకి అయినా వెళ్లు అని ఇండికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని శశిధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. చర్యలు తీసుకునేందుకు కారణమై ఉంటుంది.

English summary
marri shashidhar suspended to the congress party for the six years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X