Bigg Boss telugu 7 : బిగ్‌బాస్‌పై భారీ ట్రోలింగ్..!
బిగ్‌బాస్ 7వ సీజన్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. గత మూడు సీజన్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో..ఈ సీజన్‌పై మొదట ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కాని 7వ సీజన్ షోకు సంబంధించిన ప్రొమోలు బిగ్‌బాస్ కొత్త సీజన్‌పై అంచనాలు అమాంతం పెంచేశాయి. పైగా బిగ్‌బాస్ 7వ సీజన్ ఉల్టా, పల్టా అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.
దీనికి తోడు 7వ సీజన్‌పై ఎంతైనా ఊహించుకోండి మీ ఇష్టం అంటూ హోస్ట్ నాగార్జున చెప్పిన మాటలతో కొత్త సీజన్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. గత సీజన్లుకు భిన్నంగా బిగ్‌బాస్ 7వ సీజన్ ఉంటుందని అందరూ భావించారు. కాని ఈ సీజన్ కూడా ఆశలు రేపి ఉసూరుమనిపించింది. కంటెస్టెంట్‌ల విషయంలో మరోసారి ప్రేక్షకుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

బిగ్‌బాస్ 7వ సీజన్‌లో పెద్దగా గుర్తింపు ఉన్న ఆర్టిస్టులు ఎవరూ లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురైయ్యారు. తాజా సీజన్‌కు వచ్చిన కంటెస్టెంట్‌ల్లో.. గుర్తింపు లేనివారు కొందరైతే...అవుట్‌టెడ్ ఆర్టిస్టులు మరికొందరు. ఇక ఎప్పటిలాగే మా టీవీ సీరియల్ యాక్టర్స్‌కు ఈసారి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కొందరి కంటెస్టెంట్‌ల పేర్లు కూడా తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కంటెస్టెంట్‌ల విషయంలో మరోసారి బిగ్‌బాస్ యాజమాన్యం ఫెయిల్ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో సెంకడ్ గ్రేడ్ నటులను తీసుకువచ్చిన బాగుండేదని.. కాని గుర్తింపులేని వారితో పాటు ,టీవీ సీరియల్స్ యాక్టర్స్‌ను తీసుకువచ్చి.. షోపై అంచనాలను తగ్గించేశారని వారంటున్నారు. మరికొందరైతే వీరంతా ఎక్కడ దొరికరంటూ షో యాజమాన్యంను టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. కంటెస్టెంట్‌ల విషయంలో ఫెయిల్ అయిన బిగ్‌బాస్ , కంటెంట్ విషయంలో అయిన సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications