హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడు మాములోడు కాదు.. ఎగ్జామ్ పాస్ చేయిస్తానని ఛీట్.. ఏకంగా మెడిసిన్ విద్యార్థినే...?

|
Google Oneindia TeluguNews

ఈజీగా పరీక్ష పాస్ అవ్వాలని ఓ విద్యార్ధిని ఓ మోసగాడి వలలో పడింది. అతడు అడిగిన భారీ మొత్తం ఇచ్చి దగా పడిపోయింది. తర్వాత పోలీసులకు ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. బాబాల పేరుతో అరచేతిలో స్వర్గం చూపిస్తూ..మాయమాటలు చెప్పి డబ్బులే కాదు జీవితాలనే దోచేస్తున్నా జనాలు ఇంకా మోసపోతునే ఉన్నారు. చదువుకున్న వారు కూడా మాయలో పడిపోవటం కాస్త ఆందోళన కలిగిస్తోంది.

Blushing beauty Nivetha Thomas: బ్యూటిఫుల్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న మలయాళ కుట్టి (ఫొటోస్)Blushing beauty Nivetha Thomas: బ్యూటిఫుల్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న మలయాళ కుట్టి (ఫొటోస్)

బాబాని..చెప్పిన పూజ చేస్తే మెడికల్ ఎగ్జామ్ పాస్ అయిపోతావు అని చెప్పటంతో ఓ విద్యార్థిని అడ్డంగా బుక్ అయిపోయింది. బాబా పేరు 'విశ్వ‌జిత్ జా'. ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతిని ప‌రిచ‌యం చేసుకున్నాడు. అలా చాటింగ్‌తో ఇద్దరు మాట్లాడుకునేవారు. ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుని ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఈ సందర్భంగా నువ్వేం చేస్తావని అతను అడుగగా..నేను 'ఫారెన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేష‌న్‌' రాయటానికి ప్రిపేర్ అవుతున్నానని చెప్పింది.

mbbs student fraud by fake baba

విశ్వజిత్ జా నువ్వు మెడికల్ ఎగ్జామ్‌లో పాస్ అవ్వటానికి కాల‌భైర‌వ పూజ‌తో ఫారెన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేష‌న్‌ను పాస్ చేయిస్తాన‌ని ఆ యువ‌తికి చెప్ప‌ాడు. దీనిని ఆ యువతి న‌మ్మింది. ఆ పూజ చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయని.. ఇస్తే ..పూజ చేయిస్తానని నమ్మబలికాడు. ఎగ్జామ్ పాస్ చేయిస్తానని చెప్పాడు. మాటలు నమ్మిన సదరు యువతి.. అతను చెప్పిన బ్యాంక్ ఎకౌంట్‌లో డబ్బులు వేసింది.

విడ‌త‌లవారీగా రూ. 80 వేల న‌గ‌దును విశ్వ‌జిత్ బ్యాంకు ఖాతాలో జ‌మ చేసింది. ఆ త‌ర్వాత అత‌ని ఫోన్ స్విచ్ఛాఫ్ చేయ‌డంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఇంకేమీ చేయలేక గ‌చ్చిబౌలి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. విద్యాధికురాలు యువతి కూడా ఇలా మోసపోయింది. మెడికల్ స్టూడెంట్ పూజల్ని నమ్మటం..పూజలు చేస్తే ఎగ్జామ్ పాస్ అయిపోతానని నమ్మి డబ్బులు పోగొట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.మోసపోయానని గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా మోసపోతున్నా కొత్త కొత్త ఆలోచనలతో మోసాలు చేస్తూనే ఉన్నారు.

English summary
a mbbs student fraud by fake baba. fake baba vishwajit cheated student. incident happen at hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X