మెదక్ టాప్.. సికింద్రాబాద్ లాస్ట్.. సెగ్మెంట్ల వారీగా పోలింగ్

హైదరాబాద్‌ : తెలంగాణలో లోక్‌సభ సమరం ముగిసింది. దాదాపు నెల రోజుల సంగ్రామానికి తెరపడింది. పోలింగ్ ముగియడంతో గెలుపు లెక్కలపై ఎక్కాలు వల్లిస్తున్నారు నేతలు. అదలావుంటే రాష్ట్రంలోని 17 సెగ్మెంట్లలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా చోట్ల 5 గంటలకు క్లోజ్ అయింది.

రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 60.57 పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ లో 68.60 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా సికింద్రాబాద్ లో 39.20 ఓట్లు పోలయ్యాయి. అయితే నిజామాబాద్ సెగ్మెంట్ లో 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. దాంతో రాష్ట్రవ్యాప్త పోలింగ్ శాతం మరికొంత పెరగనుంది.

medak top secunderabad last segment wise polling details

సాయంత్రం 5 గంటల వరకు.. పార్లమెంటరీ సెగ్మెంట్ల వారీగా ఓటింగ్ శాతం చూసినట్లయితే..మెదక్ 68.60, భువనగిరి 68.25, కరీంనగర్ 68.00, ఖమ్మం 67.96, జహీరాబాద్ 67.80, ఆదిలాబాద్ 66.76, నల్గొండ 66.11, మహబూబ్ నగర్ 64.99, వరంగల్ 60.00, మహబూబాబాద్ 59.90, పెద్దపల్లి 59.24, నాగర్ కర్నూల్ 57.12, నిజామాబాద్ 54.20, చేవెళ్ల 53.80, మల్కాజిగిరి 42.75, హైదరాబాద్ 39.49, సికింద్రాబాద్ 39.20

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+