Hyderabad Metro: కీలక నిర్ణయం తీసుకున్న మెట్రో..
హైదరాబాద్ మెట్రో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. నగర వాసులకు ఊరట కలిగించేలా డిసెంబర్ 31న ఆదివారం అర్ధరాత్రి 12:15 గంటల వరకూ మెట్రో రైలు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో పేర్కొంది. చివరి మెట్రో రైలు 12:15 గంటలకు బయలుదేరి ఒంటిగంటకు గమ్యస్థానాలకు చేరుతాయని మెట్రో ఎండీ తెలిపారు.
భద్రతకు సంబంధించి కూడా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు డిసెంబర్ 31 సందర్భంగా హైదరాబాద్ పోలీసులు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

డిసెంబర్ 31 సాయింత్రం నుంచే తనిఖీలు చేపట్టనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నారు. ఈ తనిఖీల్లో బయటపడితే రూ.15000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మొదటిసారి డ్రంక్ అండ్ చేసినవారికి రూ. 10,000 ఫైన్ విధిస్తామని పేర్కొన్నారు. జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్), శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌లు (1&2), షేక్‌పేట ఫ్లై ఓవర్, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్, రోడ్ నెం.45 ఫ్లై ఓవర్, దుర్గం చెరువు కేబుల్ వంతెన, సైబర్ టవర్ ఫ్లై ఓవర్ మూసివేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు.












Click it and Unblock the Notifications