ఓట్ల వేట : ఎన్నికల కసరత్తు.. జిమ్‌లో అసదుద్దీన్
హైదరాబాద్ : ఎన్నికల కసరత్తు మొదలైంది. ప్రచార పర్వంలో ఎంపీ అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అందులోభాగంగా వినూత్న పోకడలకు సిద్ధమవుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో బిజీగా మారిపోయారు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అసదుద్దీన్ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ స్థానం నుంచి హ్యాట్రిక్ కొట్టిన ఆయన మరోసారి గెలిచేందుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ప్రచారంలో భాగంగా ఓ జిమ్‌లోకి వెళ్లిన అసదుద్దీన్ సరదాగా కొద్దిసేపు వ్యాయామం చేశారు. పుల్‌అప్స్ చేస్తూ ఫిట్‌నెస్ గురించి అక్కడి యువకులతో మాట్లాడారు. బాడీ బిల్డింగ్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని.. అదే క్రమంలో నయా హైదరాబాద్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని సూచించారు.












Click it and Unblock the Notifications