తెలంగాణలోకి భారీగా పెట్టుబడులు: పలు సంస్థలు రెడీ, ముగిసిన కేటీఆర్ అమెరికా పర్యటన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోకి పెట్టుబడులే లక్ష్యంగా చేపట్టిన మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. తొలి రోజు నుంచీ బిజి బిజీగా గడిపిన మంత్రి కేటీఆర్.. చివరి రోజు కూడా పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంా తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు నాలుగు సంస్థలు ప్రకటించాయి. లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

హైదరాబాద్ ఫార్మా రంగంలో భారీ విస్తరణ

మంత్రి కేటీఆర్‌తో భేటీ తర్వాత పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తోన్న స్లే బ్యాక్ ఫార్మా హైదరాబాద్ ఫార్మా రంగంలో భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. రాబోయే మూడు సంవత్సరాల్లో సుమారు రూ. 150 కోట్లు పెట్టుబడ పెట్టనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ ఫార్మాలో తమ కంపెనీ ఇప్పటికే రూ. 2300 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు స్లే బ్యాక్ ఫార్మా వ్యవస్థాపకుడు, సీఈవో అజయ్ సింగ్ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.

హైదరాబాద్‌లో వేల కోట్ల పెట్టుబడులు


హైదరాబాద్‌లోని లైఫ్ సైన్సెస్, పార్మా కంపెనీల్లో రూ. 1750 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, కల్పిస్తున్న మౌలిక వసతులు తమ విస్తరణ, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆ కంపెనీ వెల్లడించింది. మరో సంస్థ యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా భారీ పెట్టుబడితో నిరంతర ఫ్లో కెమెస్ట్రీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే అడ్వాన్స్‌డ్ ల్యాబ్‌లో 50 మది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం పని చేస్తుందని కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీనోమ్ వ్యాలీలో తాము ఏర్పాటు చేసే ఈ అత్యాధునిక ల్యాబ్‌కు సింథటిక్, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉంటుందని వివరించారు.

అమెరికా కంపెనీలతో మంత్రి కేటీఆర్ ఒప్పందాలు

ఇది ఇలావుండగా, హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన కాల్ అవే గోల్ఫ్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌తో ఒప్పందం చేసుకుంది. టాప్ గోల్ఫ్ బ్రాండ్‌గా కాల్ అవే కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లో కాల్ అవే నెలకొల్పనున్న డిజిటెక్ సెంటర్ ద్వారా కొత్తగా 300 మందికి ఉపాధి లభించే అవకాశాలున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. డిజిటెక్ సెంటర్‌తోపాటు గోల్ఫ్ ఉత్పత్తుల తయారీ కొరకు రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. తెలంగాణలో స్పోర్ట్స్ టూరిజంలో భాగం కావాలని కంపెనీ ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు. తన పర్యటనలో భాగంగా ఫిస్కర్ సంస్థ ఛైర్మన్, సీఈఓతో కేటీఆర్ బృందం సమావేశమైంది. భేటీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విషయంలో రాష్ట్రం అవలంభిస్తోన్న విధానానలను ఫిస్కర్ సంస్థ ప్రతినిధులకు కేటీఆర్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+