ప్రకాశ్ రాజ్‌కు మంత్రి కేటీఆర్ ప్రశంసలు.. కారణమిదే..?
వెనకబడిన గ్రామాలు, అభివృద్దికి నోచుకోని గ్రామాలపై స్టార్స్/ నేతలు ఫోకస్ చేస్తున్నారు. వాటిని డెవలప్ చేస్తున్నారు. ఆ బాటలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేరారు. తాను దత్తత తీసుకున్న గ్రామం అభివృద్దికి బాటలు వేస్తున్నారు. మిగతా వారికి ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకాశ్ రాజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.
ప్రకాశ్ రాజ్ షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.ఆ గ్రామాభివృద్ధికి ప్రకాశ్ రాజ్ చొరవ తీసుకున్నారు. పలు అభివృద్ధి పనులను చేపట్టారు. సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ ను, దిమ్మెలను ఏర్పాటు చేయించి, గ్రామాభివృద్ధికి కృషి చేశారు.

గ్రామంలో చెట్లను పెంచి పచ్చని వాతావరణాన్ని నెలకొల్పారు. ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రకాశ్ రాజ్ పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి గొప్ప పురోగతిని సాధించారని ప్రశంసించారు.ఆయన చేసిన మంచి పని.. మిగతావారికి స్పూర్తి కలిగిస్తోందని కేటీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications