KTR: 3 సంవత్సరాలలో 50వేల కోట్ల పెట్టుబడులు 4 లక్షల ఉద్యోగాలు: కేటీఆర్
మాదాపూర్ హెచ్ఐసీసీలో జరుగుతున్న మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ 2023 కార్యక్రమాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ అభివృద్ది చెందుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. హైదరాబాద్ వేదికగా ఈ -మొబిలిటీ వీక్ ఘనంగా ప్రారంభమైందన్నారు.

ఈ రేస్
మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ 2023 హైదరాబాద్ లో జరగడం గొప్ప విషయమని చెప్పారు. దేశంలో మొదటిసారిగా హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ ఫిబ్రవరి 11న జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈవీ రంగాన్నీ మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం కేటీఆర్ నొక్కి చెప్పారు. తెలంగాణ పరిశ్రమలకు అనుకూలంగా ఉందని.. అందుకే పలు ఈవీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తు చేశారు.

12 ఎకరాల్లో ఈ మొబిలిటీ వ్యాలీ
వికారాబాద్, ఎల్కతాలలో 12 ఎకరాల్లో ఈ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ ప్రకటించారు. మొబిలిటీ వ్యాలిలో ఎలెక్ట్రిక్ వెహికిల్స్ బెస్ట్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫ్యాచ్ రింగ్, రీసర్చ్ అండ్ డెవెలప్మెంట్ ఆపరేషన్లు జరుగుతాయని వివరించారు.
జహీరాబాద్, సీతారాంపూర్ లో, ఎనర్జీ స్టోరేజ్ సిస్టం దివిటిపల్లిలో మొత్తం 1200 ఎకరాల్లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఇంజినీరింగ్ ఇన్నోవేషన్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

50వేల కోట్ల పెట్టుబడులు
మొబిలిటీ వ్యాలీ ద్వారా రాబోయే 3 సంవత్సరాలలో 50వేల కోట్ల పెట్టుబడులు 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణలో నాలుగు ప్రదేశాల్లో మెగా క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ క్లస్టర్లలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీతో పాటు బ్యాటరీ పార్ట్స్ కూడా తయారు చేస్తారని వివరించారు.












Click it and Unblock the Notifications