ఒంటిపై బనియన్.. సోఫాలో కూర్చొని ఫైల్స్ వర్క్.. మంత్రి కేటీఆర్ ఫోటో వైరల్
తెలంగాణ మంత్రి కేటీఆర్ కాలికి గాయంతో ఇంటిపట్టున ఉన్న సంగతి తెలిసిందే. ఓటీటీలో షోలో, మూవీల గురించి నెటిజన్లతోపాటు సదరు సంస్థలు కూడా స్పందించాయి. ఇప్పుడు ఆయన వర్క్ మోడ్‌లోకి వచ్చారు. అవును ఫైల్స్ చూస్తు కనిపించారు. గెట్టింగ్ సమ్ ఫైల్ వర్క్ డన్ అని రాశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పడటంతో 3 వారాల పాటు విశ్రాంతి అవసరంఅని వైద్యులు సూచించారు. కాలికి పెద్ద బ్యాండెజీతో కనిపించారు. దీనికి సంబంధించి ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సంగతి తెలిసిందే. కాలికి అదే బ్యాండేజీనే కొనసాగిస్తున్నారు. అయితే ఒంటిపై బనియన్, షార్ట్‌తో కనిపించారు. సోఫాలో కాలిపై భారం పడకుండా కాళ్లు జాపుకుని కాలి కింద దిండ్లు పెట్టుకుని కూర్చున్నారు. ఫైళ్లను పరిష్కరించే పనిలో ఉన్నారు. కొంత ఫైల్ వర్క్ చేశాను అన్న కామెంట్‌తో ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ మహీంద్రా యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో శనివారం రోజున పాల్గొన్నారు. ఆ కార్యక్రమం తర్వాత కేటీఆర్ కాలుకి గాయం అయ్యింది. జూలై 24వ తేదీన (ఆదివారం) కేటీఆర్ పుట్టినరోజు. బర్త్ డే ముందు రోజే ఇలా జరగడంపై ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందారు. వర్షాలు, వరదల నేపథ్యంలో బర్త్ డే వేడుకలు జరపొద్దని కేటీఆర్ ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే.
Getting some file work done #WorkFromHome pic.twitter.com/SC2v7RtI5j
— KTR (@KTRTRS) July 26, 2022












Click it and Unblock the Notifications