అప్పుడు లేదు, తొలి, మలి దశలోనూ కూడా.. బీజేపీపై మంత్రి అజయ్ విమర్శలు
ఐదు దశాబ్దాల కల నెరవేరేందుకు సకల జనులు ఏకమయ్యారు. పార్టీలు అన్నీ కలిసి వచ్చాయి. రేపు తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. తొలి దశలోనే కాదు.. మలి దశలోనూ దాని ఊసే లేదని చెప్పారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీజేపీ నేతలపై మండిపడ్డారు. తెలంగాణలో ప్రతి అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని వివాదాస్పదంగా మార్చుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు, స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ ఎక్కడుంది? తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో బీజేపీ పాత్ర ఉందా? అని ప్రశ్నించారు.

వజ్రోత్సవాల్లో కనీసం జాతీయ జెండాలు ఇవ్వలేకపోయారని పువ్వాడ విమర్శించారు. అంతకుముందు ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలో చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీలో పాల్గొన్నారు. జెడ్పీ సెంటర్ నుంచి బీజీఎన్నార్ కాలేజి వరకు ర్యాలీ నిర్వహించారు. సభలో పువ్వాడ ప్రసంగించారు. బీజేపీపై నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో బీజేపీ యాక్టివ్ అవుతుంది. ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలను మరింత స్పీడ్ చేశారు. దీంతో మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సమైక్యతా దినోత్సవం వేళ.. మంత్రి పువ్వాడ అజయ్ కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications