రాజకీయ స్వార్థం పక్కన పెట్టండిం పది పేపర్ లీకేజీపై సబితా ఇంద్రారెడ్డి స్పందన
హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పేపర్ లీకేజీ విషయాన్నిరాజకీయం చేయొద్దన్నారు. పరీక్షల సమయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్‌మెంట్, వైద్యారోగ్యశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
4 లక్షల 95వేల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పనిచేద్దామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మొదటిసారి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్థితులకు గురిచేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి సబితా హెచ్చరించారు.

విద్యార్థుల పరీక్షల సమయంలో రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం పక్కన పెట్టాలని ఈ సందర్బంగా మనవి చేసుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా విద్యార్థుల పరీక్షల సమయంలో రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం పక్కన పెట్టాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నానని ఆమె ట్విట్టర్ వేదికగా మంత్రి సబిత స్పష్టం పేర్కొన్నారు.

సోమవారం అంటే ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రాంరభం కాగా, మొదటిరోజే వికారాబాద్‌లోని తాండూరులో ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధ్యులైన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు, మంగళవారం జరిగిన హిందీ పరీక్ష కూడా వరంగల్ జిల్లాలో లీక్ కావడం విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications