వయసులో పెద్దది.. యువతిపై మైనర్ల రేప్ అటెంప్ట్..!

హైదరాబాద్ : పట్టుమని ఇరవయ్యేళ్లు లేవు. తప్పులో కాలేశారు ఇద్దరు మైనర్లు. వయసులో తమకంటే పెద్దదైన యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది. ఎస్సై సంజీవరెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. 21 సంవత్సరాల యువతి లోకల్‌గా ఉన్న బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. అయితే ఆమె స్నేహితురాలితో ఇద్దరు మైనర్ బాలురకు పరిచయముంది. ఆ స్నేహాన్ని ఆసరాగా తీసుకుని సదరు సేల్స్ గర్ల్‌పై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.

మీ ఫ్రెండ్ నీకోసం ఎదురుచూస్తోందని నమ్మించిన సదరు యువతిని ఆ ఇద్దరూ కలిసి దమ్మాయిగూడకు తీసుకెళ్లారు. ఇంటర్ చదువుతున్న 17 సంవత్సరాల బాలుడితో పాటు చిరుద్యోగం చేసుకుంటున్న మరో 17 ఏళ్ల బాలుడు ఈ నాటకానికి తెర తీశారు. ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై ఆమెను ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు.

minor boys rape attempt on woman in malkajgiri hyderabad

శుక్రవారం సాయంత్రం డ్యూటీ అయిపోయాక ఇంటికెళ్లిన యువతి దగ్గరకు వచ్చారు. తన స్నేహితురాలు ఎదురుచూస్తోందని నమ్మించి బండిపై ఎక్కించుకుని దమ్మాయిగూడకు బయలుదేరారు. మధ్యలో నిర్జన ప్రదేశంలో బండి ఆపి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. దాంతో పెద్దగా కేకలు పెడుతూ ఎలాగోలాగా వారి చెర నుంచి బయటపడింది.

అక్కడినుంచి నేరుగా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడ కేసు నమోదు చేయించారు. అనంతరం శనివారం నాడు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని జువైనల్‌ హోంకు తరలించారు. అలాగే వారు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+