16 ఏళ్ల బాలుడు- 15 ఏళ్ల బాలిక: పలుమార్లు లైంగిక దాడి.. గర్భం

ఆధునిక పోకడో.. కాలం మహిమో కానీ అన్నీ వింతలు, విశేషాలే.. అవును ఇటీవల దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. లైంగికదాడుల గురించి అయితే చెప్పక్కర్లేదు. మైనర్లు కూడా శృతిమించుతున్నారు. మద్యం సేవించడం, తిరగడం కాదు.. అప్పుడే ప్రెగ్నెన్సీ ఘటనలు వస్తున్నాయి. విశ్వనగరి భాగ్యనగరంలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది.

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలుడు గీత దాటాడు. మైనర్ బాలిక కూడా సేమ్ సీన్.. బాలుడు ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భవతి అయ్యింది. సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐఎస్‌ సదన్ డివిజన్‌లో గల బస్తీలో 15 ఏళ్ల బాలిక, వారి ఇంటి ఎదురుగా ఉన్న కుటుంబంలో 16 ఏళ్ల బాలుడు వారి కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. రెండు కుటుంబాలు కూలీపై ఆధారపడి జీవిస్తున్నాయి.

minor girl pregnant by minor boy

ఇంట్లోని పెద్దవారు ఉదయాన్నే కూలీ పనులకు వెళ్లేవారు. ఇంట్లో పిల్లలు ఉండేవాళ్లు. ఇంట్లో పెద్దవారు ఎవరూ లేకపోవటంతో బాలుడు వారి ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోని బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలుడు, బాలిక గుట్టుగా ఉంచారు. శుక్రవారం బాలికకు విపరీతమైన కడుపునొప్పి రావటంతో బాలికను ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. ఆమె ఉదర భాగం చూసి డాక్టర్లకు అనుమానం వచ్చి పరీక్షలు చేయగా బాలిక ఐదు నెలల గర్భవతి అని తేలింది.

బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు బాలుడిని అదుపులోకి తీసుకుని బాలుర సంరక్షణా కేంద్రానికి తరలించారు. మలక్‌పేట్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలుడు/ బాలిక ఇద్దరు మైనర్లు కాగా.. ఇద్దరు తెలియక తప్పుచేశారు. మైనర్లు కాగా, తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. ఆ వయసు అలాంటిదీ మరీ.. తెలిసి తెలియన వయసులో తప్పు చేయడం.. తర్వాత బాధపడటం కామన్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+