హైదరాబాద్‌లో కీచకుడు .. 9 ఏళ్ల బాలికపై లైంగికదాడి ... పరిస్థితి విషమం
హైదరాబాద్ : మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా తెలియడం లేదు. కామంతో కళ్లు పొరలు కప్పి .. రగిలిపోతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు లైంగికదాడులకు పాల్పడుతున్నారు. వరంగల్ ఘటన మరవకముందే రాజధానిలో మరో కీచకుడు రెచ్చిపోయాడు.
ఆస్పత్రికి తరలింపు ..
హైదరాబాద్ రామంతపూర్‌లో దారుణం జరిగింది. అభం శుభం తెలియన బాలికపై కన్నేశాడు కామాంధుడు. మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. తొమ్మిదేళ్ల బాలికపై కీచకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే ఆ బాలికకు రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు గమనించారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. లైంగికదాడి చేసిన కీచకుడి కోసం బృందాలను రంగంలోకి దంపారు. చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే నిర్భయ, అభయ లాంటి చట్టాలు వచ్చినా నేరస్తుల్లో మార్పు రావడం లేదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం ఎక్కడో ఓ చోట జరిగే ఘటనలతో పిల్లలను బయటకు పంపించాలంటేనే భయపడే పరిస్థితి ఉందని పేరెంట్స్ చెబుతున్నారు.

ఓరుగల్లు ఘటన మరవకముందే ..
వరంగల్ జిల్లా హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసం ఉండే దంపతులు ఇంటి టెర్రస్ పై తమ తొమ్మిది నెలల పాపతో పాటు నిద్రిస్తున్నారు. వారు నిద్రలో ఉండగా ప్రవీణ్ అనే కామాంధుడు పాపను ఎత్తుకెళ్ళి ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో లైంగిక దాడికి దిగాడు. పాప గుక్క పెట్టి ఏడుస్తున్నా వదలకుండా చిన్నారిపై పాశవిక చర్యకు పాల్పడ్డాడు. చిన్నారి కనిపించకపోవటంతో వెతుకుతూ వెళ్ళిన తల్లిదండ్రులు ప్రవీణ్ చేస్తున్న అఘాయిత్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. అతనికి దేహ శుద్ధి చేశారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న పాపను తీసుకుని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పాప చనిపోయింది.












Click it and Unblock the Notifications