జగ్గారెడ్డి హర్షం.. కేసీఆర్‌పై ప్రశంసలు.. అపాయింట్‌మెంట్ కోరిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతరకు ప్రకటన వెలువడింది. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రకటన చేశారు. దీంతో నిరుద్యోగులు, టీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే విపక్ష ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా స్వాగతించారు. ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుపై ఆయన జ‌గ్గారెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు. ఉద్యోగ అభ్య‌ర్థుల‌ను దృష్టిలో ఉంచుకొని.. 80,039 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తామ‌ని కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై జ‌గ్గారెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న‌పై వ్య‌క్తిగ‌తంగా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాన‌ని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని తెలిపారు. రేపు సీఎంను క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతాన‌ని చెప్పారు. హౌసింగ్ విభాగాన్ని మ‌ళ్లీ తెర‌వాల‌ని కోరుతాన‌ని వెల్ల‌డించారు. బిస్వాల్ క‌మిటీ నివేదిక ప్ర‌కారం మిగ‌తా పోస్టులు భ‌ర్తీ చేయాల‌ని సూచించారు. ఈ విష‌యంలో త‌మ పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవ‌ని స్పష్టంచేశారు. ఏడేళ్లుగా నోటిఫికేష‌న్లు ఇవ్వ‌డం లేద‌ని ప‌లుమార్లు విమ‌ర్శించాం.. ఏ పార్టీ అయినా రాజ‌కీయ ల‌బ్ధి లేకుండా ప‌ని చేయ‌ద‌ని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు.

mla jagga reddy praised cm kcr on job notification

అంతకుముందు తెలంగాణలో కొలువుల భర్తీ ప్రకటన రావడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద విద్యార్థులు పటాకులు కాల్చి, సంబురాలు నిర్వ‌హించారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల సంబురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 80 వేల ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ప్ర‌క‌టించ‌డంతో సీఎం కేసీఆర్‌కు విద్యార్థులు, నిరుద్యోగులు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. ఉద్యోగ అభ్య‌ర్థుల‌ను దృష్టిలో ఉంచుకుని వ‌యో ప‌రిమితి పెంచ‌డం ప‌ట్ల కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఉద్యోగాల భర్తీ ప్రకటనతో రాష్ట్రంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. 11 వేల పైచిలుకు కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యురల్ చేస్తారు.వీటితో కలిపి కొలువుల మొత్తం సంఖ్య 91,142కి చేరాయి. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్‌, మల్టీజోనల్‌, సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులు ఉన్నాయి. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి. క్యాడర్ వారీగా ఖాళీలు వివరాలు ఉన్నాయి. జిల్లాల్లాలో- 39,829 పోస్టులు.. జోన్లలో- 18,866 పోస్టులు.. మల్టీజోనల్‌ పోస్టులు- 13,170, సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147 కొలువులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+