Raja Singh: మరోసారి వార్తల్లో నిలిచిన రాజా సింగ్.. 24 గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్..
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. కొడంగల్‌లో జరిగిన ఓ సభలో ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు నరేష్ అయ్యప్పస్వామి, అయ్యప్ప మాల స్వాములు, హిందూ దేవతలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ తీవ్రంగా స్పందించాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియోలో వీడియో పోస్ట్ చేశాడు.
అయ్యప్పమాల వేసుకున్న స్వాములు 45 రోజుల పాటు శుద్దితో, భక్తితో పూజలు చేస్తారని... శబరిమల వెళ్లి ఎంతో కష్టపడి స్వామివారి దర్శనం చేసుకుంటారని చెప్పారు. వారి పట్ల అనుచితంగా మాట్లాడడం మంచిది కాదన్నారు. హిందు దేవుళ్ల గురించి కించపరుస్తూ మాట్లాడిన నరేష్‌పై చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశాడు.

24 గంటల్లో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నారు. లేకుంటే తెలంగాణలో లక్షల్లో ఉన్న అయ్యప్ప స్వాములు రోడ్డు మీదకు వస్తారని చెప్పారు. ప్రగతిభవన్‌ను అయ్యప్ప స్వాములు ముట్టడిస్తారని, అది గుర్తించుకోవాలని రాజాసింగ్ హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలను మన సంస్కృతి కాదని రాజా సింగ్ తెలిపారు. వేడుకలను నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు.
డిసెంబర్ 31 రాత్రి, జనవరి ఒకటవ తేదీన ఎవరు ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దని కోరాడు. యువకులు జాగ్రత్తగా ఉండాలని రాజా సింగ్ సూచించారు. మనం మనం పుట్టిన స్థలాన్ని, మన సంస్కృతిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయులకు సొంతం కాని ఎలాంటి వేడుకలను జరుపుకోవాల్సిన అవసరం లేదన్నారు. రెండు వందల ఏళ్ల పాటు భారత దేశాన్ని పాలించిన బ్రిటిష్ పాలకుల సంస్కృతి ఇది అని రాజా సింగ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications