కోతి మామ బట్టలు ఉతికిిందిగా.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరుగా..! (FUNNY VIDEO)
Recommended Video
హైదరాబాద్ : కోతి పనులు చేయకురా వెధవ అని సాధారణంగా ఇంట్లో పిల్లల్ని పెద్దలు మందలిస్తుంటారు. చేయకూడని పనులు చేస్తూ పెద్దల్ని ఇబ్బందిపెట్టే పిల్లల విషయంలో ఇలాంటి డైలాగులు కామన్‌గా వినిపిస్తుంటాయి. కోతి చేష్టలు మానుకోరా నాయనా అంటూ దోస్తానాలో కూడా నవ్వులు పూయించే ఘటనలు ఉంటాయి. కానీ ఈ మంకీ వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా ఇకపై అలాంటి మాటలు వాడారేమో.
కోతి నుంచే మనిషి పుట్టుక వచ్చిందంటారు. ఆ క్రమంలో ఎవరైనా ఫన్నీ చేష్టలు చేస్తేనో.. సరాదాగా ఆట పట్టిస్తేనో.. కోతి పనులు చేయకురా అనే మాటలు తరచుగా వస్తుంటాయి. ఇంట్లో పిల్లల విషయంలోనైనా.. స్నేహితుల మధ్యనైనా ఇలాంటి మాటలంటూ ఆటపట్టిస్తూనే ఉంటారు. అయితే ఈ ఫన్నీ వీడియోలో సదరు కోతి మామ గారు చేసిన సందడి చూస్తే అలాంటి మాటలను వెనక్కి తీసుకుంటారేమో. ఎందుకంటే ఈ కోతి మనుషుల కన్నా బాగా పనిచేస్తోంది మరి.

నగరాల్లో ఐతే ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్లు ఉంటాయి. బట్టలు ఉతకడం చాలా ఈజీ. ఇక గ్రామాల్లో బట్టలు ఉతకాలంటే బండకేసి కొట్టడమే. ఏ పల్లెలో చూసినా ఇలాంటి సీన్లు పుష్కలంగా కనిపిస్తాయి. అయితే సేమ్ సీన్ ఈ వీడియోలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనుషులు బట్టలు ఉతకడం లేదు.. కోతి మామ బట్టలు ఉతుకుతోంది. కొన్ని బట్టలు తీసుకుని బండకేసి దబాదబా బాదేసింది. అచ్చు మనుషులు ఉతికినట్లే ఉతికేసింది. మధ్యమధ్యలో నీళ్లల్లో ముంచుతూ తిరిగి బండకేసి బాదింది.
Contagious behaviour. Learning to do from seeing it done by this primate is extremely amusing 😊😊 pic.twitter.com/vyBBRvmAyQ
— Susanta Nanda IFS (@susantananda3) August 2, 2019
ఈ వీడియోలో కోతి మామ చేసిన హంగామా చూస్తే ఎవరైనా సరే నవ్వు ఆపుకోలేరు. అంత బాగా బట్టలు ఉతికేసింది కోతి మామ. ఈ వీడియో ఎవరు తీశారో, ఎక్కడ తీశారో తెలియకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ కోతి మామ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సూపర్ వాష్ కోతి మామ అనిపించుకుందిగా.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications