జైల్లో రవిప్రకాశ్‌ను కలిసిన ఎంపీ రేవంత్‌రెడ్డి
చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి కలిశారు. అరెస్ట్‌కు సంబంధించిన అంశాలపై రవిప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా రవిప్రకాశ్‌కు తన సంఘీబావాన్ని ప్రకటించారు. టీవీ9 లో నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారంటూ ఏబీసీఎల్ కంపనీ లిమిటెడ్ డైకర్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం ఆయన్ను విచారించిన పోలీసులు, అనంతరం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. దీంతో రవిప్రకాశ్‌కు 14 రోజుల డిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
టీవీ9 సీఈవో ఉన్న నేపథ్యంలోనే రవిప్రకాశ్ డైరక్టర్ల అనుమతి లేకుండా కంపని డబ్బులు డ్రా చేసుకుని, దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కోన్నారు. ఈ నేపథ్యంలోనే నిబంధనలకు విరుద్దంగా 9 నెలల్లో రూ.30 కోట్లు డ్రా చేశారని, బోనస్ పేరుతో రూ.18.30 కోట్లు, టీడీఎస్ రూ.11.74 కోట్లు డ్రా చేసి నకిలీ రికార్డులు సృష్టించారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే రవిప్రకాశ్‌ను శనివారం బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో ఆయన 409, 418, 420 తదితర నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కాగా గతంలోనూ టీవీ9 ఛానల్ నిర్వహణకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టి, లోగో విక్రయం ఆరోపణలతో సైబర్‌క్రైమ్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో కొత్త యాజమాన్యం అలందా మీడియా సంస్థ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా గతంలో పెట్టిన కేసులపై ముందస్తు బెయిల్‌కు వెళ్లిన రవిప్రకాశ్‌కు కోర్టులో చుక్కెదురైంది. అయితే బెయిల్‌పై సుప్రిం కోర్టుకు కూడ వెళ్లారు.చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసుల ముందు వారం రోజుల విచారణ ఎదుర్కోన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications