విషమంగా ముఖేశ్ గౌడ్ ఆరోగ్య, చికిత్స నిలిపివేసిన వైద్యులు
హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయన శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో వైద్యులు ట్రీట్ మెంట్ నిలిపివేశారు. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీని వీడలేదు.
క్యాన్సర్‌తో పోరాటం ..
గత కొన్నినెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు ముఖేశ్ గౌడ్. క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ మరింత విషమించినట్టు అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలో గోషామహల్ నుంచి పోటీచేశారు. బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల సమయంలో అంబులెన్స్‌లో వచ్చి ఓటేసిన సంగతి తెలిసిందే. ముఖేశ్ గౌడ్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన అభిమానులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ముఖేశ్ గౌడ్ .. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. హైదరాబాద్‌లో అంజన్ కుమార్ యాదవ్, ముఖేశ్ గౌడ్ ఇద్దరూ క్యాబినెట్‌లో చోటు దక్కింది. వైఎస్ మరణం తర్వాత .. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా ఆమాత్యుడిగా కొనసాగారు ముఖేశ్ గౌడ్. 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు ముఖేశ్ గౌడ్. ఆరోగ్యం సరిగా ఉన్న సమయంలో టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగినా .. ఆయన కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications