Muralil Mohan: ఘనంగా మురళీ మోహన్ జన్మదిన వేడుకలు.. పాల్గొన్న చంద్రబాబు..
ప్రముఖ నటుడు మురళీ మోహన్ 50 పుట్టిన రోజు ఘనంగా జరిగింది. శనివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఏర్పాటు వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పాల్గొన్నారు. చంద్రబాబు మురళీమోహన్ 50 ఏళ్ల సినీ, రాజకీయ, వ్యాపార విజయాలను వివరిస్తూ రూపొందించిన 'తెలుగునేల గౌరవం తెలుగు సినీ గాంఢీవం' అనే పాటను ఆవిష్కరించారు. ఎన్నో రోజులు తర్వాత ఈ శిల్పకళావేదికకు రావడంతో పాత రోజులు గుర్తొస్తున్నాయని చంద్రబాబు అన్నారు.
ఒక్కొక్కరు ఒక్కో రంగానికే పరిమితం అవుతారని చెప్పారు. ఎన్టీఆర్ సినిమా రంగంలో ఆయనకు ఆయనే సాటిగా పేర్కొన్నారు. ఆయన పాత్రలు ఎవరూ వేయలేరన్నారు. మళ్లీ ఆయన పుట్టి వస్తే తప్ప ఆ పాత్రలు వేయడం సాధ్యంకాదని తేల్చి చెప్పారు. దేశ రాజకీయాలనూ మార్చి నూతన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. తెలుగు ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి
ఎన్టీఆర్ అని చెప్పారు.

తెలుగు జాతి బతికున్నంతకాలం వినబడే వ్యక్తి ఎన్టీఆర్ అంటూ ప్రశంసించారు. మురళీ మోహన్ 350 సినిమాల్లో నటించారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏ ఎన్నికలు వచ్చినా మురళీ మోహన్ తప్పకుండా ప్రచారం చేసేవారని చెప్పారు. రాజమండ్రి ఎంపీగా గెలిచి అక్కడి ప్రజలకు సేవలందించారని చంద్రబాబు గుర్తు చేశారు. మురళీమోహన్ మనసుపెట్టి ఏ పనైనా చేస్తాడని ప్రశంసించారు.
1978లో తాను, వెంకయ్యనాయుడు రాజకీయాల్లోకి వచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. అప్పట్లో వెంకయ్య నాయుడును చూస్తే అసెంబ్లీ గడగడలాడేదని గుర్తు చేశారు. 1984లో ఎన్టీఆర్ ను సీఎంగా తొలగిస్తే వెంకయ్యనాయుడు బీజేపీలో ఉన్నా ఎన్టీఆర్ కు అండగా ఉండి సీఎం అయ్యేదాకా నిలబడ్డారని వివరించారు. పదవులకే వన్నెతెచ్చిన వ్యక్తిగా వెంకయ్య నాయుడు నిలిచారని ప్రశంసించారు.
ఔటర్ రింగ్ రోడ్, జీనోమ్ వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రం హైదరాబాద్ కే తలమానికంగా నిలిచాయన్నారు . హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ గా మార్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఐటీ, ఫార్మా రంగం అంటే హైదరాబాద్ గుర్తొస్తుందన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. పీవీ నరసింహారావు ప్రధానిగా మెరుగైన ఆర్థిక వ్యవస్థకు పీవీ కృషి చేశారని చెప్పారు. ఆయనకు ఇప్పుడు భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications