Hyderabad Metro: మెట్రో స్టేషన్లలో మ్యూజిక్ ఈవెంట్లు..!
2024 ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్రో సంగీత కచేరి నిర్వహించనున్నారు. గోథే-జెంట్రమ్ హైదరాబాద్, L&T మెట్రో సహకారంతో నగరంలోని మెట్రో స్టేషన్‌లను 'మెట్రో మెడ్లీ' ఈవెంట్‌తో పేరుతో కచేరీ నిర్వహించనున్నారు. జూన్ 19 నుంచి 22 వరకు జరిగే 'మెట్రో మెడ్లీ' వివిధ రకాల సంగీత ప్రదర్శనలతో ప్రయాణికులను ఆకట్టుకోనుంది. ప్రయాణాలను ఆహ్లాదకరమైన అనుభవాలుగా ఇవ్వనుంది.
దీన్ని ఈవెంట్ బస్కింగ్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఇక్కడ సంగీతకారులు బహిరంగ ప్రదేశాల్లో పాడతారు లేదా వాయిద్యాలు వాయిస్తుంటారు. వర్ధమాన ప్రతిభావంతుల నుంచి అనుభవజ్ఞులైన నిపుణుల వరకు 200 మంది సంగీతకారులను 20 గ్రూపులుగా విభజించారు. ఈ కళాకారులు జాజ్, క్లాసికల్, బాలీవుడ్ హిట్‌లతో సహా అనేక రకాల సంగీత శైలులను ప్రదర్శిస్తారు.

సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నగరంలోని ఏడు మెట్రో స్టేషన్లు- అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్, ఉప్పల్ లో సంగీత కచేరిలు ఉంటాయి. కేవలం ప్రయాణికులను అలరించడమే కాకుండా కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ను ప్రోత్సహించడం.. స్థానిక సంగీతకారులకు పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌పై అవకాశం కల్పించడం ద్వారా వారికి మద్దతు ఇవ్వనున్నారు.
'మెట్రో మెడ్లీ' అందరికీ ప్రత్యేకమైన, సుసంపన్నమైన అనుభవాన్ని అందజేస్తుందని.. హైదరాబాద్ శక్తివంతమైన సంగీత ప్రతిభను ప్రదర్శిస్తుందని, సంగీతం యొక్క సార్వత్రిక భాష ద్వారా కమ్యూనిటీ భావాన్ని పెంపొందించడానికి హామీ ఇస్తుంది.












Click it and Unblock the Notifications