ఒరేయ్ శాడిస్టూ: రామ్ చరణ్‌కు బాలయ్య ఫోన్ కాల్- త్వరలో మనోడు మంచి న్యూస్ ఇస్తాడు
హైదరాబాద్: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో సీజన్ 2లో లేటెస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ఇవ్వాళ టెలికాస్ట్ అయింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్, మాచోస్టార్ గోపీచంద్ ఇందులో మెరిశారు. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందీ ఎపిసోడ్. బాలకృష్ణ-ప్రభాస్ మధ్య సాగిన సంభాషణలు ఫ్యాన్స్ ను కట్టిపడేశాయి.

ఒకరోజు ముందే..
నిజానికి ఈ ఫస్ట్ పార్ట్ ఎపిసోడ్- శుక్రవారం విడుదల అవుతుందని అందరూ భావించారు. దీనికి భిన్నంగా ఒక్కరోజు ముందే తన ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై టెలికాస్ట్ చేసింది ఆహా మేనేజ్‌మెంట్. దీనికి సంబంధించిన తొలి ప్రోమోను బుధవారం రాత్రే విడుదలైంది. ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందనే విషయంపై ట్రైలర్ చూపించింది. బాలకృష్ణ తనదైన శైలిలో ప్రభాస్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రత్యేకించి ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన టాపిక్- సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. ఒకేసారి ట్రాఫిక్ రావడంతో ఆహా కొద్దిసేపు స్తంభించిపోయింది.

డార్లింగ్ అని పిలిస్తే..
ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ఎంత తాపత్రయ పడుతున్నారనేది ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. ప్రభాస్ పర్సనాలిటీ గురించి కామెంట్స్ చేశారాయన. ఒక్కసారి డార్లింగ్ అని పిలిస్తే- దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయంటూ చెప్పుకొచ్చారు. తాను కూడా ప్రభాస్ మాయలో పడిపోయానంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వివరాలను లాగే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. సమాధానం కోసం ఎదురు చూస్తోన్నారు.

రామ్ చరణ్‌కు ఫోన్..
ఇందులో భాగంగా- ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఫోన్ చేశారు. స్పీకర్ లో పెట్టి మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. దీనిపై రామ్ చరణ్ గుడ్ న్యూస్ ఇచ్చారు. త్వరలో మనోడు మంచి న్యూస్ ఇస్తాడంటూ బాలకృష్ణకు సమాధానం ఇచ్చారు రామ్ చరణ్. అది వినగానే- ప్రభాస్ ఒరేయ్ శాడిస్టూ అంటూ రామ్ చరణ్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీనికి బాలకృష్ణ రిప్లై ఇస్తూ ఇతను శాడిస్ట్ ఏంటయ్యా. సుబ్బరంగా పెళ్లి విషయం చెబుతుంటే, పెళ్లి చేసుకుని సెటిల్ కావచ్చుగా అని ప్రభాస్‌తో చెప్పారు.

శాడిజమే కావొచ్చు..
అది నాకే తెలియని న్యూస్ అంటూ ప్రభాస్ మాట మార్చే ప్రయత్నం చేయగా.. బాలకృష్ణ మళ్లీ అడ్డుపడ్డారు. నువ్వు కూడా త్వరలో ఒక ఇంటి వాడివి కావాలని రామ్ చరణ్ కోరుకుంటున్నాడు. అది శాడిజమే కావొచ్చు.. తప్పేముంది అని సమర్థించారు. ఇంతకు పెళ్లి ఉందా లేదా ఏంటసలు? అంటూ బాలకృష్ణ ప్రశ్నించగా.. రాసిపెట్టి లేదేమో.. అని ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. దీనికి కౌంటర్‌గా బాలకృష్ణ మీ అమ్మకు చెప్పిన సమాధానం నాకు చెప్పకయ్యా అంటూ చెప్పారు.

మేడమ్ పేరేంటో తెలిసిపోయింది..
ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే మేడమ్ ఎవరో తనకు తెలిసిపోయిందంటూ బాలకృష్ణ చెప్పారు. మంచి క్లూ ఇచ్చావంటూ రామ్ చరణ్ ను ప్రశంసించారు. ఈ క్లూ తో ఇక తాను అల్లుకుపోతానని అన్నారు. మరోవంక ప్రభాస్- ఇబ్బంది పడ్డారు. ఇలా ఇరికించేవేంటి డార్లింగ్ అంటూ రామ్ చరణ్‌తో అన్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications