ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అదిరింది!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా అనే పేరు తర్వాత ఎక్కువగా ప్రజల నోళ్లలో నానిన పేర్లు ఏమైనా ఉన్నాయా? అంటే నరేష్, పవిత్రా లోకేష్. ఈ రెండు పేర్లు ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటకలో కూడా మార్మోగాయి. కొద్దిరోజుల క్రితం నటుడు నరేష్ పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకున్న వీడియో ఒకటి ట్రెండింగ్ లో నిలిచింది. స్నేహితులు, సన్నిహితుల మధ్య నరేష్, పవిత్రా లోకేష్ వివాహం చేసుకున్నారని అందరూ అనుకున్నారు. కానీ అదంతా నిజమైన పెళ్లి కాదని, అది సినిమాలో పెళ్లికి సంబంధించిన వీడియో అని స్పష్టత వచ్చింది.

ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్రానరేష్ అని చెబుతూ కొద్దిరోజుల క్రితం నరేష్ ట్వీట్ చేశాడు. దీంతో అందరూ నిజంగానే వీరిద్దరూ వివాహం చేసుకున్నారని భావించారు. దీనిపై నరేష్ ను మీడియా వివరణ కోరగా సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ మాట దాటేశారు. అయితే అదంతా సినిమా పెళ్లి అని అర్థమైంది.

ఎంఎస్ ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్ 'మళ్లీ పెళ్లి' అనే సినిమాను నిర్మించారు. దానికి సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. ముందుగా ఈ సినిమాకు 'సెకండ్ ఇన్నింగ్స్' అనే టైటిల్ అనుకున్నారు. కానీ మళ్లీ పెళ్లి అనే టైటిల్ పెట్టేశారు. ఈ సినిమాను నరేష్ స్వయంగా నిర్మించారు.

ఈ సినిమాకు సంబంధించి నరేష్ అనుసరించిన స్ట్రాటజీ సూపర్ అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎటువంటి స్టార్లు లేకపోవడంతో సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి అందులో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియోను బయటకు వదిలారని అర్థమైంది. ఈ సినిమాను పాన్ ఇండిస్థాయిలో తెలుగు, కన్నడంతోపాటు మరికొన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు.

naresh and pavitra lokesh movie malli pelli release soon

శరత్ బాబు, జయసుధ, అనన్య నాగళ్ల తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నరేష్, పవిత్రా లోకేష్ వివాహం చేసుకోవడానికి లీగల్ గా కొన్ని ఇబ్బందులున్నాయి. దీంతో ప్రస్తుత వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. వయసు మళ్లిన తర్వాత రెండో వివాహం అవసరం గురించి చర్చిస్తూ 'మళ్లీ పెళ్లి' సినిమాను నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+