పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు గానూ జాతీయ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు గానూ జాతీయ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చారు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు తమిళిసై గౌరవాన్ని కించపర్చేలా ఉన్నాయని పేర్కొంది.
ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజరు కావాలని కౌశిక్ రెడ్డిని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. కమిషన్ ముందు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

గవర్నర్‌పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇటీవల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై విమర్శలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళిసై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చేసిన బిల్లులు, ఫైళ్లను గవర్నర్.. ఎందుకు దాచుకుంటున్నారని అనుచిత పదజాలాన్ని ఉపయోగించారు కౌశిక్ రెడ్డి. ఆ తర్వాత ఇది రాజ్యాంగా? అంటూ నిలదీశారు.
తెలంగాణ గవర్నర్ శ్రీమతి @DrTamilisaiGuv గారిని కించపరుస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
— D K Aruna (@aruna_dk) January 26, 2023
♦️సభ్య సమాజం తలదించుకునేలా మహిళా గవర్నర్ పట్ల బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన బహిరంగ వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్య.... pic.twitter.com/1yqwgnIt4N
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. కౌశిక్ రెడ్డిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి ఫిర్యాదు చేశారు. గవర్నర్ తమిళిసైపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications