నాయిని పాడెమోసిన కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా..కేసీఆర్ కంటతడి..
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధువులు రోదనల మధ్య.. అధికార లాంఛనాలతో అంత్యక్రియల ఘట్టం పూర్తయ్యింది. నాయినికి కడసారి వీడ్కోలు పలికేందుకు రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు వచ్చి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పాడెమోసిన కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్
నాయిని నర్సింహారెడ్డి పాడెను కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ మోసారు. ఆయనతో ఉన్న రుణానుబంధాన్ని తీర్చుకున్నారు. నాయినితో సన్నిహితంగా మెలిగిన వారు తీవ్ర భావోద్వేగానికి గురుయ్యారు. కార్మిక నాయకుడిగా, రాజకీయ నేతగా నాయిని చేసిన పోరాటం చరిత్రలో మిగిలిపోతుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి, మలి దశ ఉద్యమాల్లో చేసిన పోరాటం గొప్పగా నిలుస్తోంది. టీఆర్‌ఎస్‌తో నాయినికి ఉన్న అనుబంధం చిరస్మరణనీయం ఉంటోంది.

కంటతడి పెట్టిన కేసీఆర్
నాయిని మరణవార్త విన్న సీఎం కేసీఆరే కంటతడి పెట్టారు. తెలంగాణ తొలి హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి పనిచేశారు. హెచ్‌ఎంఎస్‌లో సామాన్య కార్యకర్తగా పనిచేసి.. అంచెలంచెలుగా ఎదిగారు. హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి ఎదిగారు. 1978లో జనతాపార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కార్మిక రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ నాయిని నర్సింహారెడ్డి రాణించి తనదైనముద్ర వేశారు.
Recommended Video

సోషలిస్ట్ పార్టీలో చేరి..
1958లో డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా ఆధ్వర్యంలో సోషలిస్టు పార్టీలో నాయిని సభ్యత్వం తీసుకున్నారు. నాయిని తండ్రి దేవారెడ్డి సోషలిస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. అయితే ఆయనను పోలీస్ యాక్షన్‌లో కాల్చి చంపడంతో..పెద్దనాన్న కొడుకు అయిన రాఘవరెడ్డితో కలిసి దేవరకొండలో నాయిని నర్సింహారెడ్డి సోషలిస్టు పార్టీని స్థాపించారు. విద్యార్థి దశలో 1956లో వచ్చిన ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ ఉద్యమంలో, ముల్కి పాలన వ్యతిరేక పోరాటంలో, తెలంగాణలో ఆంధ్రాను విలీనం చేయవద్దని జరిగిన ఉద్యమంలో నాయిని నర్సింహారెడ్డి చురుకైన పాత్ర పోషించారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications