తెలంగాణలో వెయ్యి కోట్లు దాటిన మద్యం అమ్మకాలు: 31న ఎన్ని కోట్లంటే?
హైదరాబాద్: తెలంగాణలో కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. కేవలం ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ. 1,111.29 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. అబ్కారీ శాఖ గణాంకాలు ఈ మేరకు వెల్లడిస్తున్నాయి.
డిసెంబర్ 30న అత్యధికంగా రూ. 254 కోట్లు, 31న రూ. 216 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం 2021 డిసెంబర్ 31వ తేదీన రూ. 171.93 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయని అబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

కాగా, 2022 డిసెంబరు చివరి వారంలో రోజుకు సగటున రూ.185.21 కోట్లు విలువైన మద్యం అమ్ముడైంది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.70 నుంచి రూ.80 కోట్ల విలువ గల మద్యం మాత్రమే అమ్ముడుపోయేది. సెలవు దినాల్లో అయితే అది రూ.వంద కోట్ల వరకు చేరేది. కానీ
నూతన సంవత్సరం సందర్భం గా నెల చివరి వారంలో ఏకంగా రోజుకు రూ.185 కోట్లకుట్ల పైగామద్యం అమ్ముడుపోవడం గమనార్హం .
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ వేళలు ప్రభుత్వం పొడిగించడంతో మందు బాబులు అత్యధికంగా మద్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు ఈవెంట్ల నిర్వహణకు కూడా అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మరింతగా పెరిగింది.












Click it and Unblock the Notifications