తెలంగాణలో మరోసారి: ఉత్తర జిల్లాలపై తీవ్ర ప్రభావం: టెస్టింగులతో పాటే కేసులూ: కలవరపాటు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులు యధాతథంగా కొనసాగుతున్నాయి. సోమవారం నాటి బులెటిన్‌తో పోల్చుకుంటే తాజాగా కరోనా వైరస్ కేసుల్లో మరోసారి పెరుగుదల కనిపించింది. కరోనా టెస్టింగులకు అనుగుణంగా పాజిటివ్ కేసుల ఫలితాలూ వెలువడుతున్నాయనేది స్పష్టమైంది. వెయ్యి కంటే దిగువకే నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం నాటికి మళ్లీ పెరిగాయి. 1600లకు పైగా కొత్త కేసులు రికార్డు అయ్యాయి. డిశ్చార్జిల సంఖ్య భారీగా పెరిగింది. రెండువేలకుపైగా డిశ్చార్జిలు నమోదు అయ్యాయి.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1682 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. 2070 మంది డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 93,937కు చేరుకుంది. ఇందులో 72,202 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 711కు పెరిగింది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 21,024గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 14,140 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ కార్యాలయం బులెటిన్‌ను విడుదల చేసింది.

తాజా వివరాల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. సోమవారం నాటి బులెటిన్ ప్రకారం.. 147 కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా ఈ సంఖ్య 235కు చేరుకుంది. వరంగల్ అర్బన్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అదే స్థాయిలో రోజువారీ కేసులు రికార్డు అయ్యాయి.
24 గంటల్లో ఆదిలాబాద్-18, భద్రాద్రి కొత్తగూడెం27, జగిత్యాల-59, జనగామ-32, జయశంకర్ భూపాలపల్లి-19, జోగుళాంబ గద్వాల-69, కామారెడ్డి-44, కరీంనగర్-88, ఖమ్మం-45, కొమరంభీమ్ ఆసిఫాబాద్-9, మహబూబ్ నగర్-32, మహబూబాబాద్-13, మంచిర్యాల-79, మెదక్-36, మేడ్చల్ మల్కాజ్‌గిరి-106, ములుగు-17, నాగర్ కర్నూలు-30, నల్లగొండ-38, నిజామాబాద్-94, పెద్దపల్లి-59, రాజన్న సిరిసిల్ల- 47, రంగారెడ్డి-166, సంగారెడ్డి-18, సిద్ధిపేట్-47, సూర్యాపేట్-39, వికారాబాాద్-7, వనపర్తి-23, వరంగల్ రూరల్-20, వరంగల్ అర్బన్-107, యాదగిరి భువనగిరి-21 కేసులు నమోదు అయ్యాయి.
24 గంటల వ్యవధిలో మొత్తం 19,579 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 7,72,928కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 20,818 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications