జబర్దస్త్ లో ఏం జరుగుతోంది - మరో ఇద్దరు టీమ్ లీడర్లు గుడ్ బై : అక్కడ ప్రత్యక్షం..!!
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడేది...ఆదరించే షో జబర్దస్త్. 13 లేదా 15 ఎపిసోడ్ ల కోసం ప్రారంభమైన ఈ షో ఇప్పుడు ఎనిమిదేళ్లకు పైనా నిరాటంకంగా కొనసాగిపోతోంది. ఎంతో మంది ఈ షో ద్వారా పాపులర్ అయ్యేందుకు..వారి ఎదుగుదలకు సహకరించింది. కొంత మంది ఈ షో కారణంగా..సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో పలువురు జబర్దస్త్ వదిలి వెళ్లిపోయారు. ఇంకా వెళ్లిపోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక్కొక్కరుగా బయటకు
ఈ కామెడీ షో ఆరంభం నుంచి ఉన్న వారు సైతం వీడటం పైన చర్చ సాగుతోంది. ప్రతీ గురు..శుక్రవారాల్లో సందడి చేసే జబర్ధస్త్ పార్టిసిపెంట్స్ లో బయట ఛానళ్ల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే షో లో జడ్జిగా వ్యవహరించిన ఎంతో మంది కమెడియన్స్, జడ్జీలు వచ్చి వెళ్లారు. అయితే, ఈ ప్రభావం షో నిర్వహణలో... ఆదరణ లో మాత్రం పడలేదు. ఇక, ఇప్పుడు ఇదే కామెడీ షో కు సంబంధించి ఇద్దరు లీడర్ల అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఇద్దరు టీం లీడర్లు జబర్ధస్త్ షో నుంచి తప్పుకున్నారనేది ఆ ప్రచారంలో సారాంశం.

ఇప్పుడు మరో ఇద్దరు
అయితే, ఈ ప్రచారానికి తగినట్లుగా ఆ ఇద్దరూ ఇప్పుడు మా టీవీలో కనిపించటంతో ఆ వార్త నిజమనే చర్చ మొదలైంది. అదిరే అభి .. జిగేల్ జీవన్ కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. వారిద్దరూ..మా టీవీలో నాగబాబు, శ్రీదేవి జడ్జిలుగా ఉన్న కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో కనిపించారు. కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఫోటోను అదిరే అభి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వీరిద్దరు జబర్దస్త్ నుంచి తప్పుకున్నారనే ప్రచారం మరింతగా ఊపందుకుంది. వీళ్లిద్దరూ ఎక్కడా తాము జబర్దస్త్ వీడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించలేదు.

వాళ్లే ఫొటో షేర్ చేయటంతో
ఇప్పుడు వీళ్లకు సంబంధించిని ఫొటోలు.. మరో ఛానల్ ప్రోగ్రాంలో కనిపిస్తూ ఉన్న సీన్లు చూస్తుంటే అది నిజమనే అభిప్రాయం కలుగుతోంది. అదిరే అభి పేరుతో జబర్ధస్త్ లో కామెడీ స్కిట్ చేస్తున్నారు. ప్రస్తుతం జబర్ధస్త్ తో పాటుగా ప్రత్యేక ఈవెంట్లు..వారం వారం ప్రసారం చేస్తున్న కామెడీ కార్యక్రమాల్లో కీలకంగా మారిన హైపర్ ఆదిని సైతం జబర్ధస్త్ కు పరిచయం చేసింది అదిరి అభి. ఈ విషయాన్ని పలు మార్లు జబర్దస్త్ వేదిక నుంచి హైపర్ ఆది చెప్పుకొచ్చారు.

ప్రోగ్రాంకు క్రేజ్.. ఏ న్యూస్ అయినా వైరల్
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అదిరే అభి.. జిగేల్ జీవన్ ఆ షోను వదలి..మరో ఛానల్ లో కామెడీ షో లో చేసిన స్కిట్ నేరుగా అదిరే అభి పోస్టు చేయటంతో వారిద్దరూ ఇక జబర్దస్త్ కు గుడ్ బై చెప్పినట్లే అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వచ్చే వారం జబర్దస్త్ ప్రోమో లేదా కార్యక్రమం ప్రసారం అయిన తరువాత వీరికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications