పోలీసులే అలా చేస్తే?.. హోంగార్డుపై నిర్భయ కేసు నమోదు

హైదరాబాద్ : ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొందరు పోలీసులు దారి తప్పుతున్నారు. చేసేది పోలీస్ డ్యూటీ.. తమకేమీ అవుతుందిలే అనుకుంటున్నారో ఏమో గానీ అరాచకాలకు పాల్పడుతున్నారు. అదే క్రమంలో ఓ యువతిని వేధిస్తున్న హోంగార్డుకి తగినశాస్తి జరిగింది.

నిర్భయ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు.లాలాపేటకు చెందిన మహ్మద్ ఇలియాజ్.. చిలకలగూడ పీఎస్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ముషీరాబాద్ పరిధిలోని బాకారానికి చెందిన ఓ యువతి వెంట పడుతున్నాడు. పెళ్లి చేసుకోవాలంటూ ఏడాదిన్నరగా వేధింపులకు గురిచేస్తున్నాడు.

nirbhaya case filed on home guard

సదరు యువతి ఎంత చెప్పినా, పలుమార్లు హెచ్చరించినా.. అతడి వ్యవహారశైలి మాత్రం మారలేదు. పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడుతూనే ఉన్నాడు. దీంతో విసిగి వేసారిపోయిన బాధితురాలు ముషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. హోంగార్డు ఇలియాజ్ పై ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 354 (డి) సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+